ETV Bharat / health

బిగ్ అలర్ట్ : మీకు ఈ చిప్స్ తినే అలవాటు ఉందా? - మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి! - Potato Chips Side Effects

Potato Chips Side Effects : ఆలూ చిప్స్‌.. చిన్నాపెద్దా తేడా లేకుండా చాలా మంది ఇష్టపడే స్నాక్స్​లో ఇది ఒకటి. మీకు కూడా ఈ చిప్స్ అంటే చాలా ఇష్టమా? అయితే.. వీటివల్ల్ మీ ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో తెలుసుకోండి. ఏకంగా ప్రాణాంతక రోగాలు పుట్టుకొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 4:25 PM IST

Side Effects Of Potato Chips
Potato Chips Side Effects (ETV Bharat)

Side Effects Of Potato Chips : చాలా మంది సాయంత్రం వేళ కరకరలాడే స్పైసీ చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరికైతే ఛాయ్ తాగుతున్నా, భోజనం చేస్తున్నా.. బంగాళదుంప చిప్స్(Chips) తినే అలవాటు ఉంటుంది. మీరు కూడా ఈ చిప్స్ తెగ తినేస్తున్నారా? అయితే.. అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అలవాటు ప్రాణాలకే ప్రమాదంగా మారొచ్చంటున్నారు!

గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది : ఆలూ చిప్స్ అధికంగా తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతుందంటున్నారు నిపుణులు. వీటి తయారీలో నూనె, ఉప్పు అధికంగా యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఇవి ఎక్కువగా తింటే బాడీలో రక్తపోటు స్థాయిలు పెరిగి గుండె జబ్బుల సమస్య పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అంతేకాదు.. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది బాడీలో చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగ్గా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

2019లో "హార్ట్" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆలూ చిప్స్ ఎక్కువగా తినే వ్యక్తులకు గుండె జబ్బులు రావడానికి 28% ఎక్కువ అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ మార్కోస్ చావెజ్ పాల్గొన్నారు. ఆలూ చిప్స్ అధికంగా తీసుకునే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

క్యాన్సర్ ముప్పు​ : మీరు ఆలూ చిప్స్ అధికంగా తినడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చిప్స్​లో ఉండే అక్రిలమైడ్ అనే రసాయం క్యాన్సర్​కు కారణమవుతుందట. అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

చిప్స్ టు వైన్- ఆరోగ్యానికి మేలు చేసే అన్​హెల్తీ ఫుడ్స్​ ఇవే!

జీర్ణ సమస్యలు : బంగాళదుంపలతో తయారుచేసే ఈ చిప్స్​లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా ఇవి తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో కొన్ని సార్లు వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల క‌డుపు నొప్పి, గ్యాస్‌, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్యలు త‌లెత్తుతాయని చెబుతున్నారు నిపుణులు.

ఇమ్యూనిటీపై ప్రభావం : ఇవి ఎక్కువగా తినడం రోగ నిరోధ‌క శ‌క్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల అనేక వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ఎటాక్ చేస్తాయని, దాంతో వ్యాధుల ముప్పు పెరుగుతుందంటున్నారు.

బరువు పెరుగుతారు : ఆలూ చిప్స్ ఎక్కువగా తినడం వల్ల శరీర బరువు పెరుగుతారని చెబుతున్నారు. అందులోని అధిక కెలరీలు, ట్రాన్స్ ఫ్యాట్స్ ఇందుకు కారణమవుతాయంటున్నారు. అంతేకాదు.. వీటి కారణంగా డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు, అధిక బరువు ఉన్నవారు వీటికి దూరంగా ఉండడం మంచిదంటున్నారు.

అలాగే.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు ఎట్టిపరిస్థితుల్లోనూ డీప్ ఫ్రై చేసిన చిప్స్ వంటి స్నాక్స్ జోలికి వెళ్లకూడదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలాంటి ఆహారం వారి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

టీవీ రిమోట్ - స్నాక్స్ : నష్టం జరిగే ముందు అర్థంకాదు - జరిగిన తర్వాత అర్థమైనా ఉపయోగం లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.