Health Benefits of Pistachio Nuts: హెల్దీ స్నాక్స్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేవి డ్రై ఫ్రూట్స్. అందుకే బాదం, ఖర్జూరం, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని క్రమం తప్పకుండా తింటుంటారు. కొద్దిమంది రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తింటే, సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటారు మరికొందరు. ఎలా తిన్నా ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో పిస్తా పప్పులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఇవి రుచితో పాటు ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే క్రమం తప్పకుండా పిస్తా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాల గని : గింజపప్పుల (నట్స్) కోవకు చెందిన పిస్తాలో మంచి పోషకాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఎ, బి3, బి5, బి6, సి, ఇ విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఫ్యాట్, చక్కెర, పీచు, మెగ్నిషియం, మాంగనీస్, జింక్, పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయని చెబుతున్నారు.
క్యాన్సర్‌కు నిరోధకంగా : పిస్తా పప్పులను రోజూ తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే అనేక సమస్యలను నివారిస్తుందని నిపుణులు అంటున్నారు. పిస్తాపప్పుల్లోని పోషకాలు ఒబెసిటీ, రక్తపోటును క్రమబద్ధం చేస్తుందని వివరిస్తున్నారు. వీటిలోని యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయని, ఇవి న్యూరోడీజెనరేటివ్ సమస్యను నివారించడంతో పాటు కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుందని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యంగా : పిస్తాపప్పులను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇందులోని పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని clevelandclinic పేర్కొంది. అంతే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడం, పేగులో ఆరోగ్యమైన బాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తాయన్నారు. ఈ రుచికరమైన గింజలు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండె సంబంధింత జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయని National Library of medicine పరిశోధనల్లో తేలింది.
కంటి చూపు పదిలం : ఇతర గింజపప్పుల్లో లేని ల్యూటీన్, జియాంక్సితిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పిస్తాలో పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి రెటీనా మధ్యభాగం దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కంటిని నీలికాంతి నుంచి, వయసు సంబంధిత కంటి సమస్యల నుంచి కాపాడేందుకు, కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడతాయని వివరిస్తున్నారు. అలాగే పేగుల ఆరోగ్యానికి పిస్తాలు మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిల్లోని పీచు బ్యూటీరేట్ వంటి కొవ్వు ఆమ్లాలుగా మారడంతో పాటు పెద్దపేగులోని కణాలకు మంచి శక్తిని అందిస్తుందని తెలుపుతున్నారు. పేగుల కదలికలు మెరుగై మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.

అల్పాహారంగా తీసుకోవడం వల్ల : పిస్తాపప్పులతో మంచి ఆరోగ్యంతో పాటు చురుకైన జీవనశైలిని పెంపొందించడానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. పోషకాహార సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని పలు పరిశోధనల్లో వెల్లడైనట్లు వివరిస్తున్నారు.
అధికంగా యాంటీఆక్సిడెంట్లు : ఇతర గింజపప్పులు, ఆహార పదార్థాలు, పండ్లులతో పోలిస్తే పిస్తాలో అత్యధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని కార్నెల్ విశ్వవిద్యాలయం అధ్యయనం తేలింది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
వ్యాయామం తర్వాత : పిస్తాపప్పులు చురుకైన జీవనశైలికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి తినడానకి రుచికరంగా, ఆకలిని తీర్చగల సామర్థ్యం కారణంగా వ్యాయామం తర్వాత తినడానికి అనుకూలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ప్రతి అలాగే రోజుకు 10 నుంచి 12 పిస్తాలను తీసుకోవడం మంచిదంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చిన్న విషయాలే అని తీసిపారేయకండి! - మీ గుండె ఆరోగ్యంలో అవే 'కీ'లకం!
భోజనం చేశాక ఆకలేస్తోందా? - శరీరంలో నీటి శాతం తక్కువైతే మెదడు ఏం చేస్తుందంటే!