ETV Bharat / health

టూత్​పేస్ట్​తో ఇలా చేస్తే - టానింగ్ పోయి మీ పాదాలు కోమలంగా తయారవుతాయి! - Process at Home

Pedicure at Home : వేసవిలో చాలా మందిని టానింగ్ ప్రాబ్లమ్ వేధిస్తోంది. అలాంటి వారు ఇంట్లోనే టూత్​పేస్ట్​తో ఇలా పెడిక్యూర్ చేసుకున్నారంటే.. మీ పాదాలు మృదువుగా మారి అందంగా కనిపిస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Natural Pedicure Process at Home
Pedicure at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024 at 2:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

Natural Pedicure Process at Home : అందంగా కనిపించే విషయంలో అమ్మాయిలు అస్సలు కాంప్రమైజ్​ అవ్వరు. ఈ క్రమంలోనే చాలా మంది ముఖ వర్చసును మెరుగుపరుచుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. కానీ, ముఖంతో పాటు చేతులు, కాళ్లు.. శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటేనే అందానికి పరిపూర్ణత చేకూరుతుందని చెప్పుకోవచ్చు. అయితే, ప్రస్తుతం సమ్మర్ సీజన్​ కావడంతో కాసేపు బయట తిరిగినా పాదాలు నల్లగా మారి అందవిహీనంగా కనిపిస్తుంటాయి.

ఈ క్రమంలో ప్రతిసారి పాదాలు అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్​కు వెళ్లలేం. పైగా పార్లర్​లో పెడిక్యూర్ అంటే.. ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, అలాకాకుండా ఇంటి దగ్గరే ఈజీగా టూత్​ పేస్ట్​లో కొన్ని పదార్థాలు కలిపి పెడిక్యూర్(Pedicure) చేసుకుంటే.. మీ పాదాలపై ఉండే టానింగ్ పోవడమే కాకుండా అందంగా, మృదువుగా మారుతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

పెడిక్యూర్ కోసం టూత్ ​పేస్ట్​లో కలపాల్సినవి : ఇందుకోసం ముందుగా ఒక చిన్న పాత్రలో 1 స్పూన్ టూత్​పేస్ట్​ను తీసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో 1 టీస్పూన్ రోజ్ వాటర్, 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. ఆపై వాటన్నింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్​లా ప్రిపేర్ చేసుకోవాలి.

ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకోండిలా :

  • పెడిక్యూర్‌ చేయడానికి ముందుగా మీ కాలి గోళ్లకు ఏదైనా పాత నెయిల్ పాలిష్ ఉంటే రిమూవర్ సాయంతో పూర్తిగా తొలగించుకోవాలి. అనంతరం.. గోళ్లను అనుకున్న రీతిలో కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు శుభ్రంగా పాదాలను క్లీన్​ చేసుకోవాలి. ఇందుకోసం.. అరబకెట్‌ గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి కొన్ని నిమిషాలు పాదాలను నానబెట్టాలి. ఉప్పును యాడ్ చేయడం వల్ల అది పాదాల్లోని దుమ్మును దూరం చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
  • అవసరమైతే మంచి ఫ్యూమిస్‌స్టోన్‌ తీసుకొని మురికి వదిలేంత వరకూ పాదాలను స్క్రబ్ చేసుకోవాలి. పాదాలు క్లీన్​ చేసిన తర్వాత తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి.

మీ పాదాల్లో ఈ తేడాలున్నాయా? - అయితే మీకు ఆ రోగాలు రాబోతున్నట్టే!

  • ఇప్పుడు.. ముందుగా ప్రిపేర్ చేసుకున్న టూత్​పేస్ట్ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేయాలి. ఆ తర్వాత పాతటూత్​ బ్రష్​ తీసుకొని సుమారు 5 నిమిషాల పాటు స్మూత్​గా స్క్రబ్ చేస్తూ.. ఆపై నీటితో కడిగేసుకోవాలి.
  • ఆ తర్వాత మృదువైన టవల్ తీసుకొని పాదాలను తుడుచుకొని కాసేపు ఆరబెట్టాలి.
  • అనంతరం.. మీరు ఇంట్లో వాడే మాయిశ్చరైజర్‌ను పాదాలకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటే పాదాలు అందంగా కనిపిస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు.
  • ఇలా చేయడం వల్ల పాదాల చుట్టూ పేరుకున్న మృతకణాలు, తెల్లనిపొర తొలగిపోయి మృదువుగా మారతాయి. అలాగే.. టానింగ్ కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు నిపుణులు. వారానికోసారి ఈ విధంగా పెడిక్యూర్ చేస్తే పాదాలు క్లీన్​గా ఉండడంతో పాటు మృదువుగా, కోమలంగా కనిపిస్తాయని చెబుతున్నారు.
  • అంతేకాదు.. ఈ పెడిక్యూర్ ప్రక్రియ పాదాలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే చర్మాన్ని బిగుతుగా చేసి మెరిసేలా చేస్తుందంటున్నారు నిపుణులు. 2021లో Skin Research and Technology" జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. టూత్‌పేస్ట్‌లోని క్షీణించే కణాలు.. పాదాలలోని మృత కణాలను తొలగించడంలో, అలాగే పాదాలను మృదువుగా చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని 'Seoul National University College of Medicine'కు చెందిన డాక్టర్ J. Lee పాల్గొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పాదాలు పగులుతున్నాయా? - ఈ టిప్స్​తో గులాబీ రేకుల్లా మారిపోతాయి!