ETV Bharat / health

సూది లేకుండానే ఇంజెక్షన్లు - ఇకపై నొప్పి ఉండదట! ఇప్పటికే వాడుతున్న వైద్యులు - NEEDLE FREE INJECTIONS

నొప్పి లేని ఇంజెక్షన్లు గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

Needle_Free_Injections
Needle_Free_Injections (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : April 16, 2025 at 6:39 PM IST

Updated : April 16, 2025 at 6:47 PM IST

3 Min Read

Needle Free Injections : మనలో కొంత మంది సూది మందు​ అనగానే భయపడిపోతారు. ట్యాబ్లెట్లు వేసుకుంటామని సూదీ మాత్రం వద్దంటారు. ఇంకా చిన్న పిల్లలైతే సూది అనగానే ఆమడ దూరం పరిగెడతారు. ముఖ్యంగా డయాబెటిస్, ఇతర జబ్బుల​తో బాధపడుతున్నా వారు తరచూ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారందరికి గుడ్​న్యూస్. ఈ సమస్యకు పరిష్కరంగా సూది లేకుండా, నొప్పి తెలియకుండా ఇచ్చే పెయిన్​లెస్ ఇంజెక్షన్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. సూది లేకుండా ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీటి వల్ల కలిగే ప్రయోజనాలను National Library of Medicine వెల్లండింది.

సూది లేని ఇంజెక్షన్లు: సూది ఇంజెక్షన్​తో పోలిస్తే సూది రహిత ఇంజెక్షన్లు తక్కువ నొప్పిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బాధితుడు కోలుకోవడానికి తక్కువ సమయం పడుతుందని వివరించారు. అంతే కాకుండా మానసిక ఒత్తిడి, మెడిసిన్ మోతాదును నియంత్రించడానికి ఈ పద్దతి సహాయపడుతుందని అంటున్నారు. సూది రహిత ఇంజెక్షన్ చాలా సమర్థంగా, సురక్షితంగా ఉంటుందని mednexus పేర్కొంది.

వారి కోసమే సూది లేని ఇంజెక్షన్లు : ఇంజెక్షన్​పై ఉన్న భయంతో చాలా మంది సరైన చికిత్స తీసుకోకుండా తెలిసిన టాబ్లెట్లను మింగుతుంటారు. ట్రిపనోఫోబియాగా వ్యవహరించే ఈ సమస్యను ప్రపంచవ్యాప్తంగా 50 శాతం పిల్లలు, 30శాతం పెద్దలు ఎదుర్కొంటున్నారని అధ్యయనాల్లో తేలింది. ఇలాంటి వారి కోసమే సూది లేని ఇంజెక్షన్లు తీసుకొస్తున్నామని 'ఇంటెగ్రి మెడికల్' అనే సంస్థ ప్రతినిధులు సంబంధిత వివరాలను వెల్లడించారు.

ఎలాంటి నొప్పి లేకుండా : 'ఎన్-ఫిస్' పేరిట సూది రహిత ఇంజెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని ఇంటెగ్రి మెడికల్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ పరికరం మొదట మందును అధిక వేగంతో చర్మంపై ఉండే రంధ్రాల్లోకి జొప్పిస్తుందని తెలియజేశారు. దీంతో ఎలాంటి నొప్పి లేకుండా కండరాల్లోకి ఔషధం వెళ్తుందని వివరించారు. ప్రస్తుతం ఈ ఇంజెక్షన్​ను దేశంలో వెయ్యి కన్నా ఎక్కువ మంది వైద్యులు ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఇంజెక్షన్లు టీకాలు తయారు చేసే సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో తమ ఉత్పత్తిని వినియోగించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు.

చిన్నపాటి షాక్​లా : 'ఎన్-ఫిస్' లాగే సూది లేకుండా, నొప్పి తెలియకుండా ఇచ్చే పెయిన్​లెస్ ఇంజెక్షన్​ను ఇంతకు ముందు ఐఐటీ బాంబేకు చెందిన పరిశోధకులు 'షాక్ సిరంజీ' పేరుతో ఆవిష్కరించారు. ఈ ఇంజెక్షన్లుకు సూదులు లాంటివి పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఇవి చూడ్డానికి అచ్చం పెన్నులా ఉండే ఈ పరికరంపైన ఉన్న స్విచ్ నొక్కినప్పుడు సిరంజీలోని మందు బుల్లెట్​లా వేగంగా దూసుకొచ్చి చర్మంలోకి చొచ్చుకుపోతుంది. దీంతో నొప్పి అసలు తెలియదు. చిన్నపాటి షాక్​లా మాత్రమే అనిపిస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు. మామూలు సూదులతో వచ్చే చిన్నపాటి వాపు కూడా రాదని తెలిపారు. ఇవి చర్మాన్ని తాకవు కాబట్టి ఒకరి నుంచి మరొకరికి ఇన్​ఫెక్షన్లు వచ్చే అవకాశమూ ఉండదని అంటున్నారు. అలాగే, ఏటా టన్నుల కొద్దీ పేరుకుంటున్న బయోవేస్ట్ సమస్యకూ పరిష్కారం దొరికినట్టేనని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్ పేషెంట్లకు అలర్ట్ - "డిన్నర్" టైంలో అవి చాలా ప్రమాదకరం!

"బ్రోకలీ క్యాన్సర్​ను అడ్డుకుంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?"

Last Updated : April 16, 2025 at 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.