ETV Bharat / health

"మఖానా" పోషకాల ఖజానా - రోజూ గుప్పెడు తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా? - MAKHANA HEALTH BENEFITS

- ఫాక్స్ నట్స్​లో ప్రొటీన్, ఫైబర్ ఖనిజాలు పుష్కలం - షుగర్, బీపీ బాధితులకు మేలంటున్న నిపుణులు!

Makhana_Health_Benefits
Makhana_Health_Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : April 26, 2025 at 5:48 PM IST

3 Min Read

Makhana Health Benefits : ప్రస్తుతం సూపర్ ఫుడ్​గా పేరొందిన వాటిల్లో మఖానా ఒకటి. అధిక సంఖ్యలో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల బరువు అదుపులో ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

మఖానాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొవడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలో గ్లైసెమిక్ స్థాయి తక్కువ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని వివరించారు. అందుకే ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచి చిరుతిండిగా ఉంటుందని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యంగా : వీటిలో ఫైటో న్యూట్రియంట్స్, ఆల్కలాయిడ్స్, సెపోనిన్స్, గాలిక్ యాసిడ్స్ అనేవి గుండెకు రక్షణగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం రక్తప్రసరణ, ఆక్సీజన్ సరఫరాను మెరుగుపరుస్తుందని అంటున్నారు. దీంతో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందట.

ఫాక్స్ నట్స్​లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అనేవి చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించడంతోపాటు రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత గలవారికి ఉపయోగకరంగా ఉంటుందని "Nutritional and Phytochemical Analysis of Makhana (Euryale ferox Salisb.)" అనే అధ్యయనంలో తేలింది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : ఫైబర్ అధికంగా ఉండే ఫాక్స్​నట్స్ జీర్ణక్రియకు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేగు కదలికలను ప్రోత్సహించడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుందని, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని అంటున్నారు.

బరువు నిర్వహణలో : అధిక బరువుతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. కేలరీలు తక్కువగా, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుందని వివరించారు.

చర్మం ఆరోగ్యంగా : ఫాక్స్​నట్స్​లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్​తో పోరాడంతో పాటు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా ఉంటాయని తెలిపారు. వీటిని రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, ముడతలు రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. అంతే కాకుండా యవ్వనంగా, ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతాయని పేర్కొన్నారు.

ఎముకలు దృఢంగా : ఫ్యాక్స్​నట్స్​లో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల బలమైన ఎముకలు, దంతాలకు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల రుగ్మతలను నివారించడంలో సహాయపడతాయంటున్నారు.

శక్తి : ఇందులోని ప్రొటీన్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్ కంటెంట్ శక్తిని స్థిరంగా విడుదల చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో రోజంతా స్థిరమైన శక్తితోపాటు అలసటను పోగొట్టడానికి అద్భుతమైన స్నాక్​గా పనిచేస్తుందంటున్నారు.

రక్తపోటు అదుపులో : ఫాక్స్​నట్స్​ లోని తక్కువ గ్లైసెమిక్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా, సోడియం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వీటిని క్రమ తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణ ఉంటుందని National Library of medicine తన అధ్యయనంలో పేర్కొంది.

మెదడు పనితీరు : ఫాక్స్​నట్స్​లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయని నిపుణులు వెల్లడించారు. ఇది మొత్తం మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

వాపును నిరోధిస్తుంది : ఫాక్స్​నట్స్ వాపును తగ్గించడంలో సహాయపడే యాంటిఇన్​ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కిడ్నీ పేషెంట్లు, షుగర్ బాధితులు కొబ్బరి నీళ్లు తాగొచ్చా? - నిపుణులు ఏమంటున్నారంటే!

చిన్న విషయాలే అని తీసిపారేయకండి! - మీ గుండె ఆరోగ్యంలో అవే 'కీ'లకం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.