ETV Bharat / health

బరువు తగ్గడం లేదని బాధపడుతున్నారా?- తింటూనే బరువు తగ్గొచ్చని తెలుసా! - diet plan for weight loss

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 12:50 PM IST

Diet Plan for Weight Loss : బరువు తగ్గేందుకు బాగా కష్టపడుతున్నారా? అలవాట్లు మార్చుకుంటున్నారా లేక అలవాటు లేని పత్యాలు, ఆసనాలు, వ్యాయామాలు చేస్తున్నారా? రోజూ తింటూనే బరువు తగ్గే వీలుందని తెలుసా? మీ డైట్ ప్లాన్​లో ఈ రెండింటిని చేర్చుకుంటే మీకు తెలియకుండానే బరువు తగ్గిపోతారని నిపుణులు సూచిస్తున్నారు.

diet_plan_for_weight_loss
diet_plan_for_weight_loss (ETV Bharat)

Diet Plan for Weight Loss : శరీర బరువు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. వయస్సు, ఎత్తుకు తగ్గట్లుగా శరీర బరువును అదుపులో ఉంచగలిగితే అనారోగ్యం దరిచేరదని వైద్యులు సూచిస్తున్నారు. మారుతున్న జీవన శైలి వల్ల చాలా మందిలో అధిక బరువు సమస్య కనిపిస్తోంది. బరువు తగ్గడానికి వారు చేయని ప్రయత్నాలంటూ లేవు. అధిక బరువు కారణంగా అనేక రుగ్మతలు శరీరాన్ని చుట్టుముడుతున్నాయి. మధుమేహం లాంటి జబ్బులు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరీర బరువును తగ్గించుకునేందుకు ఆహార ప్రణాళిక అవసరం.

ఉదయం టిఫిన్ మొదలుకుని మధ్నాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనంలో తీసుకునే పదార్థాలను సరైనవి ఎంచుకుంటే బరువును అదుపులో ఉంచడం పెద్ద కష్టమేమీ కాదు. అధిక వ్యాయామం అవసరం లేకుండానే బరువు తగ్గే అవకాశాలు భోజనంలోనే ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం, రాత్రి భోజనానికి మధ్య తీసుకునే స్నాక్స్ అధిక ప్రభావం చూపే వీలుంది. మాంసకృత్తులు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన స్నాక్స్ తీసుకుంటే మంచిదని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు. చిరుతిండి విషయంలో వేరుశనగలు, తామర గింజలు అధిక పోషకాలను కలిగి ఉంటాయి. పైగా తక్కువ మొత్తంలో తీసుకున్నా ఎక్కువ శక్తినిస్తాయి. శరీర బరువు తగ్గడంలో సహాయపడే వేరుశనగ, తామర గింజల్లో ఏది బెటర్​ అని ఆలోచిస్తున్నారా?

కాల్చిన శనగలతో గుండెపోటుకు చెక్- ఆ వ్యాధి ఉన్నోళ్లకు డేంజర్! - ROASTED CHANA BENIFITS

వేరుశనగ (peanut)

మార్కెట్​లో తామర గింజలతో పోలిస్తే వేరుశనగ తక్కువ ధరకు దొరుకుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. జీర్ణం కావడానికి అధిక సమయం పడుతుంది కాబట్టి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఈ లక్షణం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వేరుశనగను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా ఆకలిని నియంత్రించవచ్చని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పల్లీలు జీవక్రియ రేటును పెంచడంతో పాటు మలబద్ధకం, దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. 100 గ్రాముల వేరుశనగల్లో 567 కేలరీల శక్తి, 26 గ్రాముల ప్రోటీన్, 49 గ్రాముల కొవ్వు పదార్థాలు ఉంటాయి.

తామర గింజలు (Lotus Seeds)

తామర గింజల్లో పొటాషియం, ఐరన్, కాల్షియం, ప్రొటీన్ తో పాటు మెగ్నీషియం ఖనిజం పుష్కలంగా లభిస్తుంది. అవన్నీ బరువు తగ్గడానికి సహకరించడంతో పాటు కండర ద్రవ్యరాశిని పెంచడానికి దోహదపడతాయి. లోటస్ గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ వ్యవస్థతో పాటు యవ్వనంగా కనిపించే లక్షణాలను కలిగి ఉంటాయి. భోజనానికి గంట ముందు తామర గింజలు తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. పైగా గుండె వ్యాధులు, నిద్రలేమి, సంతానోత్పత్తి సమస్యలు, మధుమేహం వంటి సమస్యలను ఎదుర్కోవడంలో తామర గింజలు కీలక భూమిక పోషిస్తాయి. 100 గ్రాముల తామర గింజల్లో 347 కేలరీలు, 9.7 గ్రాముల ప్రోటీన్, 0.1 గ్రాము కొవ్వు పదార్ధాలు ఉంటాయి.

వేరు శనగలో కేలరీలతో పాటు ప్రొటీన్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉంటే, తామర గింజల్లో తక్కువ మొత్తంలో లభిస్తాయి. ఈ రెండు పదార్థాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు తగ్గే వీలుంది. - డా.స్వరూపారాణి, న్యూట్రిషియన్

చాలా తొందరగా బరువు తగ్గిపోవాలని వేరుశనగ, తామర గింజలు తింటున్నట్లయితే మీరు మరో ప్రమాదంలో ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. రెండూ తక్కువ మొత్తంలో తీసుకోవాలి. అధిక మోతాదులో తీసుకుంటే ఉదరం, జీర్ణకోశ సమస్యలతోపాటు ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదాలు లేకపోలేదని ప్రముఖ న్యూట్రిషియన్ స్వరూపారాణి ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆపిల్ పండుపై స్టిక్కర్ ఎందుకంటే!- సీక్రెట్​ కోడ్ ఏంటో తెలుసా? - STICKERS ON fruits

ధనియాల కషాయం సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు- ఇలా చేయండి ఆశ్చర్యపోతారు! - coriander health benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.