ETV Bharat / health

శవాసనం బెస్ట్ బ్రెయిన్ బూస్టర్​! - నిపుణులు చెబుతున్న ఈ విషయాలు మీకు తెలుసా? - Shavasana Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 15, 2024, 7:13 AM IST

Updated : 2 hours ago

Shavasana Brain Booster : శవాసనం ప్రధానంగా ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను పెంచుతుందని తెలుసు. మెదడు పనితీరును కూడా మెరుగు చేస్తుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసుంటుంది. అదెలాగో తెలుసుకుందాం.

Shavasana Brain Booster
Shavasana Brain Booster (Getty Images)

Shavasana Brain Booster : ఉరుకులు పరుగుల ప్రపంచంలో మెదడుకు కాస్తయినా రిలాక్సేషన్ దొరుకుతుందా? రోజంతా శ్రమించి రాత్రికి ఇంటికి చేరుకోవడం, ఏదో ఆలోచిస్తూనే పడుకోవడం, ఉదయం లేవగానే మళ్లీ దినచర్య మొదలుపెట్టడం, ఇవన్నీ తప్పక చేయాల్సిందే. ప్రశాంతతే లేని జీవన విధానంతో గడిపేస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ముఖ్యంగా మనల్ని నడిపించే మెదడును చాలా కష్టపెడుతున్నాం. దానికి కూడా కాస్త విశ్రాంతిని, ఫ్రెష్ ఎనర్జీని ఇస్తే మరింత ఉత్తేజవంతంగా పనిచేస్తుంది. అది కూడా ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఆసనాల ద్వారానే సాధ్యపడుతుందంటే మరీ మంచిది కదా. ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం రండి.

మెదడు పనితీరుపై ప్రభావం
శాంతి ఆసనం, అమృతాసనం, శవాసనం ఇలా ఏ పేరుతో పిలిచినా ఒకటే. కొన్ని శతాబ్దాలుగా మెదడులోని శక్తిని ఉత్తేజితం చేసేందుకు వినియోగిస్తున్న ఆసనమిది. ప్రధానంగా ఇది మెదడుపై ఒత్తిడిని తొలగించి ప్రశాతంతనిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. మరి దీనిని ఎలా వేయాలంటే?

ఈ ఆసనాన్ని వేసే ముందు పేరుకు తగ్గట్టుగానే శవంలాగే ముందు వెల్లకిలా పడుకోవాలి. మోచేతులను, కాళ్లను చాపి ఉంచి కళ్లు మూసుకుని ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలి. ఇది చాలా సింపుల్ గా ఉందని లైట్ అనుకోవద్దు. వాస్తవానికి దీనిని యోగా ప్రక్రియ ముగించే సమయంలో వేయాలి. యోగాసనాల్లో దీనికి అత్యున్నత ప్రాముఖ్యం ఉంది.

శ్వాస మీద ధ్యాస
ఈ ఆసనంతో శరీరంలో కదలికలను నియంత్రిస్తూ శవం మాదిరిగా నిశ్చలంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. దీని ఫలితంగా శ్వాస మీదనే ధ్యాస ఉంచడం సాధ్యమవుతుంది. అలా శారీరకంగా, మానసికంగా విశ్రాంతి దొరుకుతుంది. శరీరం ఈ స్థితిలో ఉన్నప్పుడు కార్డిసాల్ స్థాయిలు తగ్గుతాయి. హృదయ స్పందన, రక్తపోటు తగ్గుతాయి. అలా మైండ్‌ను రీసెట్ చేయడానికి సహకరిస్తుంది

జ్ఞాపకశక్తిపై ప్రభావం
శవాసనాన్ని రెగ్యులర్‌గా వేస్తుండటం వల్ల మెదడు నిర్మాణంలో మార్పులు కలుగుతాయి. కొత్త కొత్త విషయాలను నేర్చుకునేందుకు కావాల్సిన ఏకాగ్రతతో పాటు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. భావోద్వేగ నియంత్రణతో సంబంధం ఉన్న మెదడులోని ప్రాంతాలలో గ్రే మ్యాటర్ పెంచుకునేందుకు సహాయపడుతుంది. ప్రతిరోజు ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసే వారు కొంత కాలం తర్వాత క్రియేటివ్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉండగల్గుతున్నట్లు రీసెర్చ్‌లు చెబుతున్నాయి. అంతేకాదు ఈ ఆసనంతో కలిగే మరో లాభమేంటంటే ఒత్తిడి లేకుండా పనిచేయడం వల్ల చక్కగా నిద్ర పోగలుగుతాం.

ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

International Yoga Day 2023 : ఫిట్​గా ఉండాలా?.. ఈ 5 ఆసనాలు వేస్తే చాలు!

ఆస్తమాతో బాధపడుతున్నారా.. ఈ యోగాసనాలు వేస్తే అంతా సెట్​!

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.