High Blood Pressure Control Tips : ప్రస్తుతం చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఇందుకు మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి ప్రధాన కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధిక రక్తపోటు సమస్య వల్ల గుండెపోటు, స్ట్రోక్తో పాటు కిడ్నీ సమస్యలు, పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో బీపీని తగ్గించుకునేందుకు చాలామంది డాక్టర్లు సూచించే మందులతో పాటు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎలాంటి మందులు వాడుతూనే సహజంగానే బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. అయితే అధిక రక్తపోటు అదుపులో పెట్టుకునే సహజ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
వ్యాయామం : క్రమం తప్పకుండా ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల అధిక రక్తపోటు 5 నుంచి 8 mm Hg వరకు తగ్గుతుందని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. వ్యాయామం అనేది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా బరువును అదుపులో పెట్టుకోవడానికి, గుండెను బలోపేతం చేయడానికి, ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

తక్కువ ఉప్పు తినండి : చాలా మంది తమకు తెలియకుండానే రోజువారీ ఆహారంలో భాగంలో ఎక్కువ ఉప్పును తీసుకుంటూ ఉంటారు. కానీ, రోజు తీసుకునే ఆహారంలో ఉప్పును కొద్దిగా తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు రక్తపోటు అదుపులో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.

పొటాషియం : ఇది హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా శరీరంలో సోడియం ప్రభావాలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుందని తెలిపారు. పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, పుచ్చకాయలు, నారింజ, అవకాడో, ఆకుకూరలు, బంగాళాదుంపలు, చిలగడదుంపలు, బీన్స్, పాలు, పెరుగు లాంటి ఆహార పదార్థాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నా వారు మాత్రం పొటాషియం కంటెండ్ ఎక్కువగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడి అదుపులో : ప్రస్తుతం మానసిక అనారోగ్యం అందరినీ ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అనారోగ్య బారిన పడేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చారిస్తున్నారు. యోగా, ధ్యానం, లోత్తెన శ్వాస తీసుకోవడం లేదా ఆరుబయట నడవడం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, దీంతో రక్తపోటు అదుపులో ఉంటుందని తెలిపారు.

మద్యం పరిమితం చేయడం : ఎక్కువగా మద్యం సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, ఇది అదనపు కేలరీలను కూడా జోడిచడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుందని MedlinePlus అధ్యయనంలో పేర్కొంది. ఆల్కహాల్ అనేది రక్తపోటుపై ప్రభావం చూపడంతో పాటు మందులపై ప్రభావాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నారు.

ఆరోగ్యకరమైన బరువుతో ఉండటం : అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకురావడానికి బరువు తగ్గడం మంచిదని British Heart Foundation పేర్కొంది. అంతేకాకుండా బరువు తగ్గడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చనని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటును నియంత్రించడం వలన దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి , గుండెపోటు, గుండె వైఫల్యం, స్ట్రోక్, దృష్టిలోపం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారించకోవచ్చనని American Heart Association పేర్కొంది.
వీటితో పాటు :
- ఫిష్ ఆయిల్, మందార టీ, వే ప్రొటీన్, వెల్లుల్లి లాంటివి సహజ సప్లిమెంట్లను తీసుకోవాలి
- మెగ్నీషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చికెన్, డెయిరీ పదార్థాలు, కూరగాయలు, తృణ ధాన్యాలు లాంటివి డైలీ తినాలి.
- శారీరకంగా చురుకుగా ఉండటం
- ధూమపానం మానేయడం
- కాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి
- కెఫీన్ వాడకాన్ని తగ్గించడంలో పాటు డార్క్ చాక్లెట్, కొకొవా ఎక్కువగా తినాలి
- ప్రాసెస్ చేసిన చక్కెర పదార్థాలు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు తగ్గించాలి
- పాలీఫినాయిల్స్ ఎక్కువగా ఉండే బెర్రీలు తీసుకోవాలి
- రోజుకు 7 నుంచి 8 గంటల పాటు హాయిగా నిద్రపోవాలి
NIH ప్రకారం రక్తపోటు స్థాయి :
- సాధారణ రక్తపోటు - 120/80 mmHg కంటే తక్కువ
- ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ - 120 /80 to 129/79 mmHg
- హైపర్ టెన్షన్ స్టేజ్ 1 - 130/80 నుంచి 139/89 mmHg
- హైపర్ టెన్షన్ స్టేజ్ 2 - 140/90 mmHg లేదా అంత కంటే ఎక్కువ
- హైపర్ టెన్షన్ క్రైసిస్ - 180/120 mmHg కంటే ఎక్కువ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"గుండెపోటు" ముందుగానే ఇలా హెచ్చరిస్తుందట - ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
"షుగర్ తగ్గడానికి మందులతో పాటు ఇవీ ముఖ్యమే" - వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!