ETV Bharat / health

నెయ్యి వాడకంతో కొలెస్ట్రాల్ పెరుగుతుందా? - నిపుణులు ఏం చెబుతున్నారంటే! - HEALTH BENEFITS OF GHEE

రోజూ నెయ్యి తింటే ఏమవుతుంది? - నిపుణులు చెబుతున్న కీలక విషయాలు

Ghee_Health_Benefits
Ghee_Health_Benefits (Getty image)
author img

By ETV Bharat Health Team

Published : June 21, 2025 at 5:14 PM IST

4 Min Read

Ghee Health Benefits : ఇంట్లో కమ్మగా తయారు చేసుకునే స్వీట్లు మొదలుకుని స్పైసీగా చేసుకునే బిర్యానీ వరకూ అన్నింట్లో నెయ్యి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఎందులో వేసినా సరే, దాని రుచి అమృతం లాగా ఉంటుంది. అయితే, నెయ్యిలో ఆహార రుచిని పెంచే గుణాలే కాకుండా, అందులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. నెయ్యి వల్ల రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వాన్ని, కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రసుత్తం నెయ్యిని వినియోగించడం ఆరోగ్యానికి అమృతమా? విషమా? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

నెయ్యి
నెయ్యి (Getty image)

తెలుగు వారి భోజనం అనగానే షడ్రుచులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ కంచంలోకి మాత్రం కచ్చితంగా ఒక ఆవకాయ పచ్చడి, కాస్త కమ్మటి నెయ్యి మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో మనలో చాలామంది నెయ్యిని ఒక విష పదార్థంగా చూస్తున్నారు. ఎందుకుంటే, దీన్ని వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండెపోటు సమస్యలు వస్తాయని భయపడుతున్నారు.

మందులు వేసుకోకుండానే BP కంట్రోల్ అవుతుందా? - అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే!

milk
milk (Getty image)

నెయ్యి ఆరోగ్యానికి మంచిదా : పూర్వం పశుసంపద నుంచి సేకరించిన పాలు నుంచి పెరుగు, దాని ద్వారా వెన్న తీసి, మరిగించి శ్రేష్ఠమైన నెయ్యిని తయారు చేసుకునే వారు. దీన్ని ఆహారంతో తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మరింత మహాభాగ్యంగా మలుచుకున్నారు. అంతేకాదు భారతదేశ సంప్రదాయంలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉందని జనరల్ ఫిజీషియన్ డా.శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. పూర్వకాలంలో ఆహారంలో నెయ్యి లేకుండా భోజనం చేయకూడదు అనే నియమం ఉండేదని, దీని వల్ల జీవన ప్రమాణం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయని, మనిషి శారీరక బలంగా ఉంటారని, మేథాశక్తి మెరుగుపడుతుందని ఇలాంటి అనేక సుగుణాలను ఆయుర్వేద శాస్త్రం నెయ్యికి ఆపాదించిదని వివరించారు.

శుద్ధి చేసిన నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరగడం, విటమిన్ డి లభించడం నుంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సరైన జీవనశైలిని పాటించే వారిలో నెయ్యి వల్ల అద్భతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం లాంటి వాటికి దూరంగా ఉన్న వారిలో, మధుమేహం, గుండె జబ్బులు వారికి హాని కలిగించవచ్చు. స్వచ్ఛమైన నెయ్యి ఆరోగ్యానికి మంచిదే. కానీ, దీన్ని మితంగా వినియోగించుకోవాలి. - డా.శంకర్ ప్రసాద్, జనరల్ ఫిజీషియన్

పెరుగు
curd (Getty image)

అలా చేయడంతో : నెయ్యి తయారీ పరిస్థితి 1970 నుంచి మారుతూ వచ్చిందని డా. శంకర్​ప్రసాద్ తెలిపారు. ముఖ్యంగా గుండెపోటుకు కారణమయ్యే వాటిపై అవగాహన, బాధితుల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండటంతో పాశ్చాత్య దేశాలు నెయ్యి వాడకాన్ని ఒక కారణంగా పరిగణించారని డా.శంకర్​ప్రసాద్ వెల్లడించారు. ఇలాంటి కొవ్వు పదార్థాలు నెయ్యిలో ఉండటం వల్ల చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం మార్కెట్లో లేదా ఇంట్లో పాలను నుంచి నేరుగా వెన్నను తియడం వల్ల కొన్ని పోషక విలువలు తగ్గిపోతున్నాయని వివరించారు. ఇలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ghee
ghee (Getty image)

కల్తీ వాడకం వల్ల : నెయ్యి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయని వాదనలు, భయాల కారణంగా చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో కల్తీ పదార్థాలు రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో మనం తినే ప్రతి ఆహారపదార్థం కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండాలని, చూడగానే ఆకర్షించడానికి, రుచిగా ఉండాలని రకరకాల హానికరమైన రసాయనాలు కలుపుతున్నారు! ఈ కోవకే నెయ్యి కూడా వస్తుందని వివరించారు. ఇలాంటి కల్తీ నెయ్యిని వాడడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం ఉండదని, దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు.

నెయ్యి
నెయ్యి (Getty image)

ఎన్నో ప్రయోజనాలు : విటమిన్ డి అనేది సాధారణంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ద్వారా మనకు లభిస్తుంది. కానీ నెయ్యి క్రమంగా తీసుకోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న సందేహం చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు. కానీ కొలెస్ట్రాల్ స్వతహాగా బాడీకి మంచిదే, కానీ కొన్ని సందర్భంలో కీడు చేస్తుందని డా. శంకర్ ప్రసాద్ అంటున్నారు. బాడీకి మంచిదనైన కొలెస్ట్రాల్ ఎందుకు హాని కలిగిస్తుందో అర్థం చేసుకోవాలని, నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పే అధ్యయనాలు ఎక్కువగా లేవని తెలిపారు. కానీ పాశ్చత్య దేశాల్లో చీజ్, కొన్ని జంతువుల నుంచి తయారీ చేసిన కొవ్వు పదార్థాలపై జరిపిన పరిశోధన కారణంగా ఇది ఆరోగ్యానికి మంచిది కాదని పలు పరిశోధనలు ఉన్నాయని వివరించారు.

నెయ్యి
నెయ్యి (Getty image)

NOTE : నెయ్యికి సంబంధించి ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పిల్లలు వయస్సుకు తగ్గ బరువు, ఎత్తు ఎంత ఉండాలో తెలుసా? - WHO ఏం చెప్తోందంటే!

షుగర్ పేషెంట్లకు అలర్ట్ - వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్న నిపుణులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.