ETV Bharat / health

అదే పనిగా "పీచు" పదార్థాలు తీసుకుంటున్నారా? - నిపుణులు ఏమంటున్నారంటే!

"ఫైబర్ మాక్సింగ్" అంటే? - అధికమైతే సమస్యలు తప్పవట!

Health Benefits of Eating Fiber
Health Benefits of Eating Fiber (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : September 14, 2025 at 9:48 AM IST

3 Min Read
Choose ETV Bharat

Health Benefits of Eating Fiber : ఆరోగ్యానికి ఫైబర్ ఎంతో మేలు చేస్తుంది. అందుకే వైద్యులు పేగు ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి పీచు పదార్థాలు ఎక్కువగా తినాలని సలహా ఇస్తుంటారు. ఈ క్రమంలో 'ఫైబర్ మాక్సింగ్' అనే కొత్త ట్రెండ్ జనాదరణ పొందుతోంది. ఈ ట్రెండ్​ను ఎలా పాటించాలనో, ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం!

ఫైబర్ మాక్సింగ్ : జీర్ణక్రియ, జీవ క్రియ మెరుగుపడేలా ఎక్కువగా ఫైబర్​ను తినడమే 'ఫైబర్ మాక్సింగ్'. ఈ విధానం ఆరోగ్యానికి మంచిదైన, శరీర అవసరమైన దానికి కన్నా ఎక్కువ తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Benefits of Eating Fiber
ఫైబర్​తో ఆరోగ్యం (Getty Images)

రోజూ ఎంత తీసుకోవాలంటే? : పెద్దలకు 2 వేల కిలో క్యాలరీలకు 30 గ్రాముల రోజువారీ ఫైబర్ అందించాలని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సిఫార్సు చేస్తుంది. అదే విధంగా 1-3 సంవత్సరాల చిన్నారులకు 15 గ్రాములు, స్కూలుకు వెళ్లే పిల్లలకు 20 గ్రాములు, హైస్కూలు వెళ్లే విద్యార్థులకు 25 గ్రాములు చొప్పున ప్రతిరోజూ ఫైబర్ తీసుకోవాలని పేర్కొంది. USDA సిఫార్సు చేసిన రోజువారీ మొత్తం మహిళలకు 25 గ్రాములు, పురుషులకు 38 గ్రాములు తినాలని, అలాగే 50 ఏళ్లు పైబడిన మహిళలు 21 గ్రాములు, పురుషులు 30 గ్రాములు తినాలని Harvard Health Publishing అధ్యయనంలో పేర్కొంది.

మీ ప్లేటులో స్నాక్స్​లా :

  • ఉదయం అల్పాహారం బదులు ఓట్స్, చియా పుడ్డింగ్ తీసుకోవచ్చు.
  • ప్లేటులో బాదం, పిస్తా, స్నాక్స్​లా తొక్కతీయని కీరా, ఆపిల్స్, క్యారెట్లు, బ్రకోలి, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
  • చిక్కుళ్లు, శనగలు, రాజ్మా, మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
  • తృణధాన్యాలూ, అవిసె, సబ్జా, గుమ్మడికాయ గింజలు, మెంతులు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బీన్స్, బఠానీలు, అవకాడోల్లో పీచు బాగా లభిస్తుంది.

'కిడ్నీలకు' ముప్పు తెచ్చే అలవాట్లు ఇవే! - నిపుణులు ఏమంటున్నారంటే!

Benefits of Eating Fiber
ఫైబర్​తో ఆరోగ్యం (Getty Images)

పేగుకు మేలు : ప్రతి భోజనంలో అధిక ఫైబర్ ఉండే ఆహారాలు చేర్చడం వల్ల పెద్దపేగు సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఫైబర్, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా, కడుపు నిండుగా ఉన్నట్లు చేస్తుందని పేర్కొన్నారు. దీంతో శరీరం గ్రహించే క్యాలరీల సంఖ్య తగ్గించడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుందని, చెడు కొలెస్ట్రాల్​ను గణనీయంగా తగ్గించడంతో పాటు గుండెజబ్బులు, పేగు క్యాన్సర్​లను నివారిస్తుందంటున్నారు.

సిఫార్సు చేసిన ఫైబర్ కంటే అదనంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుండవు. ప్రతి వారం దినచర్యలో అత్యధిక ఫైబర్ ఉన్న ఆహారం ఒకటి చేర్చుకుంటూ రావాలి. అందుకు బాడీ ఎలా స్పందిస్తుందో గమనించి, క్రమంగా రోజూ ఆహారంలో ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. - మానస, డైటీషియన్

ఎక్కువైతే ప్రతికూల ప్రభావమే : ఫైబర్ మాక్సింగ్ పేరుతో కొందరు పౌడర్స్, సప్లిమెంట్లను ఉపయోగిస్తున్నారని, ఇవి పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదు మించి ఒక్కసారి ఫైబర్ సప్లిమెంట్లు తీసుకుంటే పొట్టలో ఉబ్బరం, గ్యాస్, కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. ఈ క్రమంలో ఫైబర్ తీసుకున్నప్పుడు జీర్ణక్రియకు మద్ధతుగా ప్రతిరోజూ తగినంత నీరు, జ్యూస్ వంటి ద్రవాలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలా నీరు తీసుకోకపోవడం వల్ల పేగు చికాకు, పొత్తికడుపు, తిమ్మిరి వంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. అంతేకాదు తీసుకున్న ఆహారంలోని కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాల గ్రహించడంలోనూ ఆటంకం ఏర్పడుతుందని తెలిపారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

విటమిన్ డి లోపంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు? - ఇలా చేస్తే మంచిదంటున్న నిపుణులు!

రాత్రిపూట నిద్రలేవడానికి కారణాలు ఇవే! - ఇలా చేస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​ అవుతుందట!