ETV Bharat / health

రీసెర్చ్​ : మీ ఒంట్లో షుగర్ ఎంత ఉన్నా- లవంగాలు ఇలా తీసుకుంటే చాలు! - దెబ్బకు నార్మల్​ అయిపోతుంది! - Cloves For Diabetes Control

Cloves Health Benefits : డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి జనాలు నానా అవస్థలు పడుతుంటారు. బార్డర్​ దాటిన షుగర్​ను కిందకు తేవడానికి మందులు మొదలు.. ఆహార నియమాల వరకూ ఎన్నో ప్రయత్నిస్తుంటారు. అయితే.. వీటితోపాటు లవంగాలను సరైన పద్ధతిలో తీసుకుంటే షుగర్ తప్పకుండా కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 19, 2024, 9:30 AM IST

Diabetes Control With Cloves
Cloves Health Benefits (ETV Bharat)

Diabetes Control With Cloves : కొన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్​లో ఉండవు! అలాంటివారు మీ రోజువారీ డైట్​లో లవంగాలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. మరి.. లవంగాలు డయాబెటిస్(Diabetes) నియంత్రణకు ఎలా తోడ్పడతాయి? వాటిని ఏ విధంగా తీసుకోవాలి? తద్వారా కలిగే ప్రయోజనాలేంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మసాలాల్లో రారాజుగా పిలుచుకునే లవంగాలలో అనేక ఔషధ గుణాలుంటాయంటున్నారు నిపుణులు. అలాగే వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా లవంగాలలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. దీంతోపాటుగా లవంగాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బోలెడు ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.

లవంగాలను ఎలా తీసుకోవాలంటే?

రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉండాలంటే.. ముందుగా ఒక బౌల్​లో గ్లాస్ వాటర్ తీసుకొని, అందులో 6 నుంచి 8 లవంగాలు వేసి స్టౌపై మరిగించుకోవాలి. ఆ తర్వాత వాటర్​ను వడకట్టుకొని కాస్త చల్లార్చుకోండి. అంటే.. గోరువెచ్చగా మారాక తాగాలి. దీన్ని మూడు నెలల పాటు ఫాలో అయితే మంచి రిజల్ట్ కనిపిస్తుందంటున్నారు నిపుణులు. లేదంటే.. డైలీ రెండు నుంచి మూడు లవంగాలు నమిలినా ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు. ఇవి తీసుకోవడం మాత్రమే కాదు.. తినే ఆహారం కూడా కంట్రోల్​లో ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

2018లో "Journal of Diabetes, Lifestyle And Clinical Research"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. టైప్ 2 మధుమేహం ఉన్న వ్యక్తులు 4 వారాల పాటు రోజుకు 3 లవంగాలను తినగా వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చెన్నైలోని మద్రాస్ మెడికల్ కళాశాలకు చెందిన ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ ఎ. రాజ్ మోహన్ రావు పాల్గొన్నారు. లవంగాలలో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

అలర్ట్​: ఎగ్స్​ తింటే షుగర్ వస్తుందా? - పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు!

ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు : లవంగాలను తీసుకోవడం ద్వారా కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్​ ఉండడమే కాదు.. మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఫ్లూ, జలుబు, బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్లు బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు. అలాగే.. జీర్ణ ఎంజైమ్​ల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుందంటున్నారు. అదేవిధంగా లవంగాలలో ఉండే పోషకాలు ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతాయట. అంతేకాదు.. లవంగాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఒత్తిడి(Stress)ని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జలుబు, దగ్గు నుంచి డయాబెటిస్, గుండె సమస్యల నివారణ వరకు - దివ్యౌషధంలా తమలపాకు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.