ETV Bharat / health

షుగర్​ బాధితులకు వ్యాయామాలు - అవేంటో మీకు తెలుసా? - Exercises for Diabetes

Best Exercises for Diabetes : దీర్ఘకాలిక జబ్బుల్లో షుగర్​ ఒకటి. ఒక్కసారి బ్లడ్​లో​ షుగర్​ ఉన్నట్టు నిర్ధారణ అయితే.. జీవన విధానంలో ఎన్నో మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఆహారంలో మార్పులు చేసుకుంటూ, మందులు వాడుకోవడం తప్ప మరో అవకాశం లేదు. అయితే.. కొన్ని వ్యాయామాలు కూడా డయాబెటిస్​ను అదుపు చేస్తాయని చెబుతున్నారు వైద్యులు. ఆ వివరాలు మీ కోసం..

author img

By ETV Bharat Health Team

Published : Sep 13, 2024, 1:53 PM IST

Diabetes
Best Exercises for Diabetes (ETV Bharat)

Exercise to Lower Blood Sugar : ప్రస్తుత కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలలో డయాబెటిస్​ ఒకటి. ఒక్కసారి షుగర్​ జబ్బు వచ్చిందంటే ఇక జీవితమంతా మందులు వాడుతూ.. ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే రక్తంలో గ్లూకోజ్​ స్థాయులు పెరిగి కిడ్నీ, గుండె జబ్బులు వంటి ఎన్నో రకాల హెల్త్​ ప్రాబ్లమ్స్​ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే.. మధుమేహ బాధితులు రోజూ కొన్ని రకాల వ్యాయామాలు (national library of medicine రిపోర్ట్​) చేయడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉండేలా చూసుకోవచ్చని సూచిస్తున్నారు. షుగర్​ని కంట్రోల్లో ఉంచే ఆ వ్యాయామాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

స్విమ్మింగ్​ : స్విమ్మింగ్ అనేది ఒక మంచి కార్డియో వ్యాయామం. ఇది క్యాలరీలను బర్న్ చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల కండరాలు ఎక్కువగా పని చేస్తాయి. దీంతో శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు కండరాలు గ్లూకోజ్‌ను శక్తిగా మార్చుకుని ఉపయోగించుకుంటాయి. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే షుగర్​ ఉన్నవారు స్విమ్మింగ్​ చేయాలని సూచిస్తున్నారు.

సైక్లింగ్ :
సైక్లింగ్ చేసేటప్పుడు మన కండరాలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. ఈ కండరాల కదలికకు శక్తి అవసరమవుతుంది. ఈ శక్తిని పొందడానికి మన శరీరం రక్తంలోని గ్లూకోజ్​ను ఉపయోగించుకుంటుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. డయాబెటిస్​తో బాధపడేవారు క్రమం తప్పకుండా సైక్లింగ్​ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

2018లో 'జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు సైక్లింగ్​ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బ్రెజిల్​లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డో రియో ​​గ్రాండే డో సుల్ (UFRGS)కు చెందిన 'డాక్టర్​ డానియేలా అంపియర్' పాల్గొన్నారు.

వాకింగ్​ :
షుగర్​ ఉన్నవారు సమతుల ఆహారం తీసుకుంటూ.. రోజూ వాకింగ్​ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఉదయం, సాయంత్రం అరగంట పాటు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నడక పైసా ఖర్చు లేకుండా చేసే వ్యాయామం కాబట్టి, డయాబెటిస్​ వారు రోజూ వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.

జాగింగ్ :
డయాబెటిస్​తో బాధపడేవారు జాగింగ్​ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్​ స్థాయులు నార్మల్​గా ఉంటాయి. కానీ, మీరు జాగింగ్​ చేసే ముందు తప్పకుండా వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించాలి. వారి సలహాలు, సూచనల మేరకు మాత్రమే జాగింగ్​ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

యోగా :
షుగర్​ జబ్బున్న వారు యోగా చేయడం వల్ల.. గ్లూకోజ్​ స్థాయులు నార్మల్​గా ఉండడంతో పాటు ఒత్తిడి తగ్గుతుంది. యోగా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయం చేస్తుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

మధుమేహం​తో తీవ్రంగా బాధపడుతున్నారా? - ఇలా రోజూ చేస్తే షుగర్ పరార్!

అలర్ట్​: డయాబెటిస్​ ఉన్నవారు ఈత కొట్టడం మంచిదేనా? - నిపుణుల సమాధానమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.