ETV Bharat / health

రోజూ గుడ్డు తినొచ్చా? - గుడ్డులో కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణులు ఏం చెబుతున్నారంటే! - EGG YOLKS GOOD OR BAD FOR HEALTH

రోజూ గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనుమానాలు - పరిశోధనలు ఏం చెప్తున్నాయో తెలుసా?

Egg_Health_Benefits
Egg_Health_Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : April 30, 2025 at 5:29 PM IST

3 Min Read

Egg Health Benefits : 'సండే అయినా, మండే అయినా రోజూ తినండి గుడ్డు' అని అడ్వర్టజ్మెంట్​లో వింటూ ఉంటాం. ఈ మధ్య కాలంలో కొంత మంది గుడ్డులో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని తినడం మానేస్తున్నారు. మరికొందరు గుడ్డులోని తెల్లసొన తిని, పచ్చసొనను పక్కన పెడుతుంటారు. నిజానికి వీటి రెండింటిలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మరి గుడ్డులోని కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం!

గుడ్డు
గుడ్డు (Getty image)

గుడ్డులో ప్రొటీన్, విటమిన్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ సహా వివిధ ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. రోజూ గుడ్డు తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. కానీ గుడ్డు తినటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలియజేస్తున్నారు.

గుడ్డులో కొలెస్ట్రాల్ : గుడ్డు తెల్లసొనలో ప్రొటీన్ అధికంగా ఉంటుందని mayoclinic పేర్కొంది. పచ్చసొనలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుడ్లు అనారోగ్యకరంగా చాలా మంది పరిగణిస్తారు. ఎందుకంటే అధిక కొలెస్ట్రాల్ అనేది గుండె జబ్బులకు దారితీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో చాలా మంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారపదార్థాలను దూరం ఉంచుతారు. అందులో గుడ్డు ఒకటని నిపుణులు వివరిస్తున్నారు.

గుడ్డు
గుడ్డు (Getty image)

ఆరోగ్యానికి మంచిదే : గుడ్డులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. నిజానికి రెండు పెద్దసైజ్ గుడ్లలో దాదాపు 411 మి.గ్రా కొలెస్ట్రాల్ ఉంటుందని పేర్కొన్నారు. కానీ పలు అధ్యయనాల సిఫార్సు ప్రకారం రోజుకి గరిష్ఠంగా 300 మి.గ్రా కంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని తెలియజేస్తున్నారు. గుండెజబ్బులతో బాధపడుతున్న వారు రోజుకు 200mg కంటే తక్కువగా కొలెస్ట్రాల్ తీసుకోవడం మంచిదని National Library of Medicine పేర్కొంది. మరి గుడ్డులో మోతాదుకు మించి కొలెస్ట్రాల్​ ఉందని తినకూడదని అనుకుంటే పొరపాటే అంటున్నారు నిపుణులు. ఇందులో ఉన్నాది మంచి కొలెస్ట్రాల్ అని, అది ఆరోగ్యానికి మంచి చేస్తుందని వివరించారు.

కొలెస్ట్రాల్ ను కాలేయం ఉత్పత్తి చేస్తుందని Harvard Health publishing అధ్యయనంలో పేర్కొంది. కొన్ని సార్లు గుడ్లు వంటి అధిక కొలెస్ట్రాల్ కలిగిన పదార్థాలు తీసుకున్నప్పుడు కాలేయం తక్కువ కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో రోజూ గుడ్డు తీసుకున్న రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు.

గుడ్డు
గుడ్డు (Getty image)

గుండెజబ్బులున్న వారికి : క్రమం తప్పకుండా గుడ్డు తినడం గుండె జబ్బుల బారిన పడే ఛాన్స్ ఉందని చాలా మంది అనుకుంటారు. కానీ రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి లేదా గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఉండదని నిపుణులు అంటున్నారు. అధికబరువు లేదా బాధపడుతున్నా వారిలో కూడా చెడు కొలెస్ట్రాల్, గ్లైసెమిక్ నియంత్రణలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు.

మరోవైపు గుడ్లు తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్లు అనేవి తక్కువ కార్బొహైడైల్స్ ఉండటం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ పేషంట్స్ ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని పేర్కొన్నారు. అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచడంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుదలకు దోహదం చేస్తుందని తెలియజేస్తున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు : క్రమం తప్పకుండా గుడ్లు తినటం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న ప్రొటీన్ జీవక్రియ రేటు పెరగడం వల్ల బరువు అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. గుడ్డులో పచ్చసొనలో కోలిన్ అనే పోషకం సమృద్ధిగా ఉండటంతో మెదడు పనితీరు, గుండె, కాలేయం అనేవి ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. గుడ్లలోని లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని వివరిస్తున్నారు.

NOTE : గుడ్డుకు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

శరీరంలో "కొలెస్ట్రాల్" గురించి మీకు తెలుసా? - దీని వల్ల ఏం జరుగుతుందంటే!

గొంతు వాపు, మింగడంలో ఇబ్బందిగా ఉందా? - "థైరాయిడ్" హెచ్చరికలు ఎలా ఉంటాయంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.