ETV Bharat / health

రోజంతా ఏసీలోనే పనిచేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా? - ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి?

Dry Eye Syndrome
Dry Eye Syndrome (Getty images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : September 29, 2025 at 3:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Dry Eyes Syndrome Due to AC : ప్రస్తుతం వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు తరచుగా ఫ్యాన్లు, కూలర్లు లేదా ఎయిర్ కండిషనర్లను వినియోగిస్తున్నారు. వీటిలో ఏసీ నుంచి వచ్చే గాలి అత్యంత చల్లగా ఉంటుంది. కానీ, సుదీర్ఘ కాలం ఏసీ చల్లదనంతో కళ్లకు ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. దీని వల్ల 'డ్రై ఐ సిండ్రోమ్' కేసులు పెరుగుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఎందుకంటే, ఏసీ చల్లదనానికి ఎక్స్​పోజర్, గాలి నుంచి తేమను లాక్కుంటుందని, ఫలితంగా కళ్లను పొడిబారుస్తుందని చెబుతున్నారు. దీంతో పాటు రోజుకు 6 నుంచి 7 గంటల పాటు స్క్రీన్ చూడటం వల్ల ఈ సమస్య పెరుగుతుందని వివరించారు. ఈ క్రమంలో డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఇప్పుడు తెలుసుకుందాం!

మంట, దురద, ఎర్రగా మారడం, చూపు మందగించడం, కళ్ల నుంచి నీళ్లు కారడం, పుసులు రావడం, వెలుగును తట్టుకోలేకపోడవం లాంటివి డ్రై ఐ సిండ్రోమ్ వల్ల కనిపించే లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. ఏసీల చల్లదనం అనేది గాలి నుంచి తేమను తొలగిస్తుందని, దీనివల్ల అక్కడి వాతావరణం పొడిబారుతుందంటున్నారు. ఇది కళ్లలో సహజంగా ఉండే తడిని తగ్గిస్తుందని పేర్కొన్నారు. అలాగే, సరిగా ఆహారం తీసుకోకపోవడం, డీహైడ్రేషన్, కాలుష్యం, సరిగా నిద్ర లేకపోవడం వంటివీ ఈ రుగ్మతను పెంచుతాయని తెలిపారు. ఏసీ వల్ల కంటి దురద కళ్లు పొడిబారడం, ఎరుపు కూడా ఉంటాయని annallergy.org అధ్యయనంలో పేర్కొంది.

రోజువారీ వాకింగ్​లో ఈ "షార్ట్​కట్స్" పాటించండి - తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్!

Dry Eyes Syndrome Due to AC
Dry Eyes Syndrome Due to AC (Getty images)

ఏసీలో ఎక్కువ గంటలు ఉండటం వల్ల కలిగే నష్టాలు :

చర్మం పొడిబారడం : ఏసీ వల్ల వాతావరణంలో తేమ తగ్గిపోవడం వల్ల చర్మం, కళ్లు పొడిగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే, చర్మం బాగా దెబ్బతింటుందని పేర్కొన్నారు.

నిర్జలీకరణం : ఏసీ చల్లని గాలి కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉందని, అందువల్ల దాని వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

Dry Eyes Syndrome Due to AC
Dry Eyes Syndrome Due to AC (Getty images)

శ్వాస సమస్యలు : ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల దుమ్ము, ఫంగస్ లేదా ఏసీ ఫిల్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల అలెర్జీలు లేదా ఆస్తమా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

రోగనిరోధక శక్తి బలహీనం : మనం అకస్మాత్తుగా ఏసీ గాలి నుంచి బయటి వేడిలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలో మార్పు వస్తుందని, దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుందంటున్నారు నిపుణులు. దీని ఫలితంగా జలుబు లేదా ఫ్లూ వస్తుందని పేర్కొన్నారు.

కీళ్లు, కండరాలలో దృఢత్వం : ఏసీ చలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఆర్థరైటిస్ తీవ్రమవుతుందని పేర్కొన్నారు. కీళ్లు, కండరాలలో దృఢత్వం తగ్గిపోతుందని తెలిపారు.

బద్ధకం-అలసట : నిరంతరం ఏసీ లోని చల్లని గాలికి గురికావడం వల్ల మీ శరీరం బద్దకంగా ఉంటుందని, దీంతో చురుగ్గా ఉండలేరని వివరించారు. ఇది శరీర శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.

Dry Eyes Syndrome Due to AC
Dry Eyes Syndrome Due to AC (Getty images)

తలనొప్పి, సైనస్ : ఏసీ నుంచి వచ్చే చల్లని, పొడి గాలి సైనస్ రద్దీని కలిగిస్తుందంటున్నారు. ఈ సమస్య తలనొప్పి లేదా మైగ్రేన్‌లకు దారితీస్తుందని తెలిపారు.

వెంటిలేషన్ లేకపోవడం : మూసివేసిన ఏసీ గదులలో నివసించడం వల్ల స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ తీసుకోవడం పరిమితం అవుతుందని, దీనివల్ల ఊపిరాడకపోవడం, అలసటగా అనిపిస్తుందని వివరించారు.

Dry Eyes Syndrome Due to AC
Dry Eyes Syndrome Due to AC (Getty images)

జాగ్రత్తలు : ఏసీ ఉష్ణోగ్రతను అత్యంత తక్కువ స్థాయిలో ఉంచకూడదని, దీని నుంచి వచ్చే గాలి నేరుగా శరీరానికి తాకేలా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గదిలో తేమ ఉండేలా పరిరక్షించే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా, ఎల్లప్పుడూ శరీరం హైడ్రేటెడ్​గా, స్క్రీన్​ను ఉపయోగించేటప్పుడు కళ్లను ఆర్పుతూ ఉండాలని, పొడి వాతావరణంలో రక్షణ కళ్లద్దాలను వినియోగించాలని nih.gov అధ్యయనంలో పేర్కొంది. అంతేకాకుండా, కళ్లను తడిగా ఉంచుకోవడానికి అవసరమైన మందులను వైద్యుల సూచనల మేరకు వాడాలని పేర్కొన్నారు.

నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం : డ్రై ఐ సిండ్రోమ్​ను నిర్లక్ష్యం చేస్తే, అది కార్నియాను దెబ్బతీయవచ్చని, దీంతో కంటి చూపు పోవచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్, థైరాయిడ్, దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో ఈ సిండ్రోమ్ మరింత ప్రమాదకరమంటున్నారు.

ముందు గుర్తిస్తే చికిత్స సులభం : డ్రై ఐ సిండ్రోమ్​ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే, కంటి చుక్కలు, మందులతో తగ్గించవచ్చని, వ్యాధి ముదిరితే శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చని తెలిపారు.

డీజే సౌండ్ ఎక్కువ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!

ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులివేనట!