Constipation Causes and Remedies in Children : ఒకప్పుడు పిల్లలు ఆట, పాటలతో ఆనందంగా గడిపేవారు. దీంతో వీరు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ప్రస్తుతం పిల్లల్లో శారీరక శ్రమ తగ్గిపోవడం, ఎంతసేపూ కదలకుండా ఒకే చోట కూర్చోవడం, గంటల తరబడి గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల ఒబెసిటీ వంటి సమస్యలే కాదు మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పిల్లల్లో తలెత్తే ఈ సమస్యకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
"హై బీపీ" కంటి చూపును ప్రభావితం చేస్తుందా! - పరిశోధనలు ఏం చెప్తున్నాయో తెలుసా?

కారణాలివేనా : పిల్లల్లో మలబద్ధకం సమస్య రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు వినియోగం పెరిగిపోవడంతో గంటల తరబడి వాటికే అతుక్కొని పోతున్నారు. దీంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. ఆటాలాడకుండా ఎక్కువ సేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఒబెసిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా నీళ్లు సరిగ్గా తాగకపోవడం, ద్రవ పదార్థాలు తగిన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య వస్తుందని తెలిపారు.

పిల్లల్లో మలబద్ధకం : అంతే కాకుండా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తగినంతగా తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ వినియోగం పెరగడం వల్ల పిల్లల్లో మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటితో పాటు రాత్రిపూట ఆలస్యంగా తినడం, అర్ధరాత్రి వరకు మేల్కోవడం, నిద్రలేమి, జీవక్రియల పనితీరు మందగించడం లాంటి సమస్యల పిల్లల్లో మలబద్ధకం లాంటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అంతే కాకుండా చాలా అరుదుగా, కొన్ని అంతర్లీన హైపోథైరాయిడిజం లేదా యాంటీడిప్రెసెంట్స్, ఐరన్ సప్లిమెంట్లు, నార్కోటిక్ నొప్పి లాంటి కొన్ని మందులు పిల్లలలో మలబద్ధకాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని NIH పేర్కొంది.

ఈ చిట్కాలతో మేలు : ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లును పిల్లలతో తాగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. రుచి కోసం అందులో టీస్పూన్ తేనె, నిమ్మరసం కూడా కలిపి అందించవచ్చనని పేర్కొన్నారు. దీనితో పాటు రాత్రి నీటిలో నానబెట్టిన 4-5 ఎండు ద్రాక్షలను పరగడుపునే తినిపించాలని సూచిస్తున్నారు.
పడుకునే ముందు : అంతేకాకుండా గోరువెచ్చని పాలలో అర టీ స్పూన్ ఆవు నెయ్యి కలిపి రాత్రి పూట పడుకునే ముందు పిల్లలకు అందించడం మలబద్ధకం సమస్య ఉండదని పిల్లలు చెబుతున్నారు. పచ్చి ఆహార పదార్థాలను పిల్లలు జీర్ణం చేసుకోలేరు కాబట్టి వారికి ఉడకబెట్టిన, వండిన ఆహార పదార్థాలనే అందించాలని తెలిపారు. అంతే కాకుండా మలబద్ధకాన్ని నివారించడానికి లేదా ఉపశమనం పొందడానికి తక్కువ లేదా ఫైబర్ లేని ఆహారాలకు దూరంగా ఉండాలని NIH పేర్కొంది
ఫైబర్ కంటెంట్ అధికంగా : పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, నూనె మోతాదును బాగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయని mayoclinic పేర్కొంది. అందుకే చిన్నారుల రోజువారీ ఆహారంలో పీచు అధికంగా ఉండేలా చూసుకోవాలని వివరించారు. ఈ క్రమంలో ఓట్స్, యాపిల్, స్ట్రాబెర్రీ, అవకాడో, నిమ్మజాతి పండ్లు వంటివి ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలని సలహా ఇస్తున్నారు.

వ్యాయామంతో : పిల్లలకు వాకింక్, రన్నింగ్, జాగింగ్ వివిధ రకాల వ్యాయామాలు చేయించడంతో పాటు ఆటలాడేలా వారిని ప్రోత్సహించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చిట్కాలు పాటిస్తున్నా పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గుముఖం పట్టకపోతే వారిని సంబంధిత డాక్టర్లు సంప్రదించడం వారికి తగిన చికిత్స అందించడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : పిల్లల్లో మలబద్ధకం సమస్యపై ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చిటికెడు "ఇంగువ" అంత పని చేస్తుందా?! - ఆ ప్రయోజనాలే కొందరికి ప్రమాదకరం కూడా!
ఆయుర్వేద రారాజు 'అశ్వగంధ'తో 'షుగర్' అదుపులో ఉంటుందా? - నిపుణుల సమాధానమిదే!