Causes Of Early Age Menstruation : ఆడ పిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కావడానికి పలు కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఆహారం ప్రధాన కారణమని అంటున్నారు. ముఖ్యంగా.. పిజ్జా, బర్గర్, చిప్స్, డోనట్స్ వంటి జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ పుడ్స్ తీసుకోవడం వల్ల.. వాటిలో అధికంగా ఉండే చక్కెర శాతం, అనారోగ్యకరమైన కొవ్వులు హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తున్నాయని చెబుతున్నారు. ఈ దుష్ప్రభావాల ఫలితంగానే అమ్మాయిలు చిన్న వయసులోనే పీరియడ్స్ పొందుతున్నారని చెబుతున్నారు.
2016లో 'Journal of Adolescent Health'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినే అమ్మాయిలలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణమవుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జాన్ స్మిత్ పాల్గొన్నారు. జంక్ ఫుడ్స్ అధికంగా తినడం వల్ల హార్మోన్స్‌పై ప్రభావం పడి చిన్న ఏజ్‌లోనే అమ్మాయిల్లో పీరియడ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
పీరియడ్స్ టైమ్‌లో పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? - ఈ విషయాలు తెలియకపోతే ఇబ్బందే!
అధిక బరువు : అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా కూడా పీరియడ్స్ త్వరగా రావచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. శరీరంలో అధిక కొవ్వు కణజాలం ఉండటం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయని, ఇవి చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి దారితీస్తాయంటున్నారు. ముఖ్యంగా తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల అధిక బరువు సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు.
జన్యువులు : అమ్మాయిల్లో చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి జన్యువులు కూడా ఒక కారణమని చెబుతున్నారు నిపుణులు. ఒక కుటుంబంలోని మహిళలకు.. అంటే తల్లి, మేనత్త.. ఇలా ఎవరికో ఒకరికి చిన్న వయసులోనే పీరియడ్స్ వస్తే.. అదే కుటుంబంలోని తర్వాతి తరం బాలికలలో కూడా చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు.
వస్తువులు : ప్లాస్టిక్ వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఉండే ఫ్తాలేట్స్, బిస్ఫినాల్ A, ఇతర రసాయనాలు.. ఈస్ట్రోజెన్ సహా ఇతర హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తాయట. ఈ కారణంగా కూడా పీరియడ్స్ త్వరగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
ఒత్తిడి : దీర్ఘకాలంపాటు మానసిక ఒత్తిడికి గురైతే కూడా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి ఇది కూడా ఒక కారణం కావొచ్చని చెబుతున్నారు.
చిన్న వయసులో పీరియడ్స్ వస్తే..?
చిన్న ఏజ్‌లో వచ్చే పీరియడ్స్ కారణంగా.. ఆడపిల్లలు భవిష్యత్తులో పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం పెరగవచ్చంటున్నారు నిపుణులు. రొమ్ము క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులు, జీవక్రియకు సంబంధించిన సమస్యలు వంటి కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. చిన్న వయస్సులోనే పీరియడ్స్ రావడం వల్ల.. బాలికలలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్ల తల్లిదండ్రులు పై విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీరియడ్స్ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్‌తో రిలీఫ్ పొందండి!