ETV Bharat / health

"టీ"లో యాలకులు వేస్తున్నారా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!

యాలకులతో కూరలకు రుచి మాత్రమే కాదు - ఈ ప్రయోజనాలు లభిస్తాయని నిపుణుల వెల్లడి!

Health Benefits of Cardamom Tea
Health Benefits of Cardamom Tea (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : July 8, 2025 at 4:21 PM IST

4 Min Read
Choose ETV Bharat

Health Benefits of Cardamom Tea : చాలామందికి టీ అంటే ఒక ఎమోషనల్ బాండింగ్. ఉదయాన్నే నిద్ర లేవాలన్నా, పనికి వెళ్లాలన్నా, అలసట పోగొట్టుకోవాలన్నా టీని తాగుతుంటారు. అదే టీకి కాస్త యాలకులను యాడ్ చేస్తే దాని రుచి అమోఘం. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులను టీ, స్వీట్స్ నుంచి కూరల్లో సువాసన కోసం ఉపయోగిస్తాం. వీటిని ఎందులో వేసినా సరే, దాని రుచి అమృతం లాగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టీలో యాలకులను జోడించడం వల్ల రుచిని పెంచడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

రుచి, సువాసన : టీలో యాలకులు జోడించడం వల్ల తక్షణ ప్రభావాల్లో రుచి ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఇవి టీలో తీపి, పూల రుచిని నింపుతాయని, దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు వంటివి ఘాటును కలిగిస్తాయని పేర్కొన్నారు.

Cardamom
యాలకులు (Getty Images)

జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది : యాలకులు టీలో వేయడం వల్ల జీర్ణ ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా యాలకులు జీర్ణ వ్యవస్థలోని కండరాలను సడలించడానికి కూడా సహాయపడతాయని, ఇవి భోజనం తర్వాత అసౌకర్యాన్ని తగ్గిస్తుందని వివరించారు.

బరువు : టీలో యాలకులు వేయడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుందని, తద్వారా కేలరీల ఖర్చు పెరిగి బరువు అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలని అనుకునే వారికి యాలకుల టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా యాలకుల టీ వల్ల శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.

కాలంతో సంబంధం లేకుండా వేడి నీటితో స్నానం చేస్తున్నారా? - నిపుణులు సమాధానమిదే!

Cardamom Tea
యాలకుల టీ (Getty Images)

డిటాక్సిఫైయర్ : యాలకులు కాలేయం, మూత్రపిండాలు పనితీరుకు మద్దతు ఇచ్చే సమ్మేళనాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యాలకులతో కలిపిన టీ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగిస్తుందని పేర్కొన్నారు.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది : యాలకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయని, ఇవి రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. టీలో యాలకులను జోడించడం ద్వారా శరీరానికి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని, అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్​తో పోరాడటానికి సహాయపడుతుందంటున్నారు.

Cardamom
యాలకులు (Getty Images)

ఒత్తిడిని తగ్గిస్తుంది : యాలకులు సహజంగా మానసిక స్థితిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. యాలకులను టీలో జోడించడం వల్ల సెరోటోనిన్, ఇతర మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని, దీంతో మానసిక స్థితి మెరుగుపడుతుందని తెలిపారు. అంతేకాకుండా యాలకుల టీ నుంచి వచ్చే సువాసన ఒత్తిడి తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుందని తెలిపారు. దీంతో ఆందోళన, ఒత్తిడి దూరమవుతుందని వివరించారు.

శ్వాసకోశ ఆరోగ్యం : సాంప్రదాయ వైద్యంలో శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడానికి యాలకులను ఉపయోగించేవారని నిపుణులు చెబుతున్నారు. ఇవి నేచురల్ డీకాంజెస్టెంట్​గా పనిచేస్తుందని, తద్వారా దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాస సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చుని పేర్కొన్నారు. టీలో యాలకులు జోడించడం వల్ల మూసుకుపోయిన వాయుమార్గాలను క్లియర్ చేయడంలో, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు. ఇవి శ్వాసను సులభతరం చేయడానికి, మెరగైన శ్వాసకోశ ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుందని తెలిపారు.

నోటి ఆరోగ్యం : యాలకులు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల నోటి దుర్వాసన రాకుండా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. టీలో యాలకులు జోడించడం వల్ల శ్వాసను తాజాగా ఉంచడానికి, నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడానికి సహాయపడుతుందని వివరించారు. ముఖ్యంగా ఇందులో ఉండే సినోల్ అనే పదార్థం నోటి దుర్వాసన, ఇతర ఇన్ఫెక్షన్లను ఉత్పత్తి చేసే బాక్టీరియాతో పోరాడుతుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. అలాగే చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.

Cardamom Tea
యాలకుల టీ (Getty Images)

షుగర్ లెవెల్స్ : టీలో యాలకులు వేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని, దీంతో డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని వివరించారు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని National Library of Medicine పేర్కొంది.

గుండె ఆరోగ్యం : యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చుని తెలిపారు. ఇందులోని పోషకాలు చెడు కొలెస్ట్రాల్ కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతాయని, అందుకే హైబీపీతో బాధపడేవారు క్రమం తప్పకుండా యాలకులు టీ తాగడం మంచిదని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

"బ్రౌన్ రైస్" ఆరోగ్యానికి మంచిదేనా? అందరూ తినొచ్చా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

ఆరోగ్యంగా ఉన్నా "సడన్​ హార్ట్​ ఎటాక్​" ఎందుకు వస్తుంది? - నిపుణుల సమాధానమిదే!