Is Fried Foods Can Cause Cancer?: చాలా మందికి డీప్ ఫ్రై చేసిన ఆహారాలు అంటే విపరీతమైన ఇష్టం. హోటల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లినప్పుడు ఇటువంటి ఫుడ్స్‌ను ఆర్డర్ చేస్తుంటారు. కేవలం బయటికి వెళ్లినప్పుడు మాత్రమే కాదు ఇంట్లో ఉన్నా ప్రిపేర్ చేసుకుని తింటుంటారు. మీరు కూడా అలానే చేస్తుంటారా? అయితే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పదార్థాలను ఎక్కువగా ఫ్రై చేసి తీసుకోకూడదని వివరిస్తున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎందుకు డీఫ్ ఫ్రై చేయకూడదు: ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వేడి చేయడం వల్ల హానీకారక రసాయనాలు ఉత్పత్తి అవుతాయని అంటున్నారు. ఈ రసాయనాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే కొన్నింటిని ఎక్కువగా వేడి చేయకూడదని ముఖ్యంగా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదని అంటున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని ప్రచురితమైంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి). ఈ నేపథ్యంలోనే అతిగా ఫ్రై చేయని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మాంసం : మాంసాన్ని ఎక్కువ సేపు ఫ్రై చేయడం వల్ల క్యాన్సర్‌కు కారణమయ్యే కారకాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద మాంసాన్ని వండినప్పుడు, హెటెరోసైక్లిక్ అమైన్స్ (HCAs), పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) అనే రసాయనాలు ఏర్పడతాయని అంటున్నారు. ఈ రసాయనాలు DNA ను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేయించడం వల్ల క్యాన్సర్‌కు కారకమయ్యే కార్సినోజెన్స్ అనే రసాయానాలు ఉత్పత్తి అవుతాయని హెచ్చరిస్తున్నారు. అందుకే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాంసాన్ని కుక్ చేసుకోవాలని వివరిస్తున్నారు. ఇలా చేస్తే క్యాన్సర్ ముప్పును తప్పించుకోవచ్చని వెల్లడిస్తున్నారు.

బంగాళదుంపలు : మెజార్టీ పీపుల్స్‌కు చిప్స్ అంటే చాలా ఇష్టం. సైడ్ డిష్‌గా, స్నాక్స్‌గా వీటిని తింటుంటారు. అయితే, బంగాళ దుంపలను చాలా సేపు అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో వేయించడం వల్ల హానీకారక అక్రిలైమైడ్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని, ఫలితంగా క్యాన్సర్‌కు దారితీస్తుందని తెలుపుతున్నారు. అందుకే చిప్స్ కాకుండా వీటిని ఉడకబెట్టడం లేదా బేక్ చేసుకుని తినాలని సూచిస్తున్నారు.

చికెన్ : చికెన్‌ను గ్రిల్లింగ్, డీప్ ఫ్రై చేయడం వల్ల హానీకారక కార్సినోజెన్స్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చికెన్‌ను నేరుగా ఫ్రై చేయకుండా మారినెట్ చేసుకుని తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వండుకోవాలని సూచిస్తున్నారు.

చేపలు : చేపలను ఫ్రై ముఖ్యంగా గ్రిల్లింగ్ చేయడం వల్ల హానీకారక రసాయనాల ఉత్పత్తి అవుతాయని నిపుణులు అంటున్నారు. అందుకే ఇలా కాకుండా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఉడికించుకోవాలని సూచిస్తున్నారు.

బ్రెడ్ : మనలో చాలా మంది బ్రెడ్‌తో ఆమ్లెట్, టోస్ట్ లాంటి రకరకాల వంటకాలు చేసుకుంటారు. అయితే, వీటిని ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయడం వల్ల క్యాన్సర్ కారక అక్రిలైమైడ్ ఉత్పత్తి అవుతుందని తెలుపుతున్నారు. అందుకే మరీ ఎక్కువగా కాకుండా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కాల్చుకోవాలని లేదా బేక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వాడిన ఫ్రై నూనె : మనలో చాలా మంది వాడిన నూనెనే మళ్లీ మళ్లీ ఉపయోగిస్తుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల అందులో నుంచి క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం వెళ్లడం అనారోగ్యానికి సంకేతమా? షుగర్ లేకున్నా వస్తే ప్రమాదమా?
నిద్రలేమితో డయాబెటిస్, అధిక బరువు, బీపీ ప్రాబ్లమ్స్ - ఇలా చేస్తే నిమిషాల్లోనే డీప్ స్లీప్!