Broccoli Consumption Daily And Reduce Risk of Cancer : బ్రోకలి క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుందా? క్యాన్సర్ కణాల పెరుగుదలను బ్రోకలి నియంత్రిస్తుందా అనే అంశాలపై జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర ఫలితాలు కనిపించాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. కాలిఫ్లవర్, క్యాబేజ్ మాదిరి లాగే బ్రోకలి కూడా క్రూసిఫరస్ ఆకుకూర. ఇందులో క్యాన్సర్‌ను అడ్డుకునే లక్షణాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. National Library of Medicine కూడా బ్రోకలి ప్రయోజనాలను వెల్లడించింది.

మన రోజువారీ ఆహారంలో కొంచెం బ్రోకలి తీసుకువడం వల్ల అది క్యాన్సర్‌ను అరికట్టేందుకు సాయపడుతుందని ఒరెగాన్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బ్రోకలి ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం యాంటీ క్యాన్సర్‌గా పనిచేస్తుందని, బ్రెస్ట్ క్యాన్సర్‌ను తగ్గించే పదార్థాలు కూడా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రెస్ట్ ఎక్స్- రేలో అసాధారణ సంకేతాలు కనిపించిన మహిళల్లో రోజూ ఒక కప్పు బ్రోకలి మొలకలు తిన్న తర్వాత అసాధారణ కణాల పెరుగుదల నియంత్రణల్లోకి వచ్చినట్లు ఓ అధ్యయనంలో తేలింది.
క్యాన్సర్ బ్రోకలి ఎలా అడ్డుకుంటుంది? : సల్ఫోరాఫేన్ అనే పదార్థం బ్రోకలి వంటి ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. డీఎన్ఏలో మ్యుటేషన్స్‌ను నియంత్రించడం ద్వారా క్యాన్సర్‌ను అడ్డుకట్ట వేస్తుందని అంటున్నారు. బ్రోకలి అసలు లేదా తక్కువగా తినే వారితో పోలిస్తే ఎక్కువగా తినే వారిలో చాలా వరకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. బ్రోకలి లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్, కెరొటెనాయిడ్స్గా పిలిచే పిగ్మెంట్స్ ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. దీన్ని తినేవారిలో జన్యుపరమైన వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.
ప్రొస్టేట్ క్యాన్సర్‌నూ తగ్గిస్తుంది : క్యాన్సర్ కణాల పెరుగుదలను బ్రోకలి అడ్డుకోగలదని నార్ఫోక్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌పై పరిశోధన చేసే సమయంలో ఇందులో సల్ఫోరాఫేన్ పదార్థం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫాస్పెటేస్, పీటీఈఎన్(టెన్సిన్ హోమోలాగ్) జన్యువు లోపించడం వల్ల పెరిగే కణాల వృద్ధిని సల్ఫోరాఫేన్ అడ్డుకుంటుందని American Institute for cancer research అధ్యయనంలో తేలింది.
టెన్సిన్ హోమోలాగ్ జన్యువు తక్కువగా లేదా క్రియాశీలకంగా లేనప్పుడు ప్రొస్టేట్ క్యాన్సర్ విస్తరిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జన్యువు క్యాన్సర్‌ను అధిగమిస్తుందని అంటున్నారు. ఇది పాడైనా లేదా చురుకుగా లేకపోయినా ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుంందని నార్విచ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
బ్రోకలి వల్ల ఇంకేం లభాలున్నాయంటే! : బ్రోకలిలో ఉండే సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఆర్థరైటిస్‌ను నివారించేందుకు కూడా సాయపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే పొట్ట, గుండె, జీర్ణవ్యవస్థలో ఉన్న సమస్యలను నియంత్రించేందుకు కూడా ఇది సాయపడుతుందని వివరించారు. ఇందులో ఉన్న ఫైబర్ పేగుల్లోని ఉన్న హానికరమైన బాక్టీరీయాను అరికడుతుందని పేర్కొంటున్నారు. National Library of Medicine కూడా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలను గురించి వివరించింది.
మెదడు ఆరోగ్యంగా : తక్కువ క్యాలరీలూ, పీచు ఎక్కువగా ఉండే బ్రోకలి మెదడుకీ మంచి ఆహారమే అని నిపుణులు అంటున్నారు. ఇందులోని గ్లూకోసైనోలేట్స్ శరీరంలోకి చేరాక ఐసోథయోసైనేట్స్గా మారతాయని వివరించారు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వయసుతో పాటు వచ్చే నరాల క్షీణతను తగ్గిస్తాయని తెలియజేశారు. ఇందులోని కె, సి విటమిన్లు, ఇతర ఫ్లేవొనాయిడ్లూ మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయని పేర్కొంటున్నారు. విటమిన్ కెకీ ఆలోచనాశక్తికీ సంబంధం ఉందనీ, ఇది మెదడు కణాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందనీ నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ ప్రాణాంతక మహమ్మారి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? - అయితే నిర్లక్ష్యం చేయకండి!
అజీర్తితో బాధపడుతున్నారా?- ఈ టిప్స్ పాటిస్తే కంట్రోల్లో ఉంటుందట!