Urvashi Rautela Cannes 2025 : 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా సాగుతోంది. ఫ్రాన్స్ నగరంలో మంగళవారం ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ ప్రారంభమైంది. వరల్డ్‌వైడ్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేస్తున్నారు. భారత్ నుంచి బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, ఊర్వశీ రౌతెలా, ఐశ్వర్యారాయ్ పాల్గొన్నారు. వీళ్లంతా ట్రెండీ ఔట్ ఫిట్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ఊర్వశి మాత్రం తన ఔట్ఫిట్తో అందరి దృష్టిని ఆకర్షించింది.
మల్టీ కలర్లో ఉన్న పొడవాటి గౌనును ధరించింది. నెమలి డిజైన్‌తో ఉన్న ఈ ఔట్ఫిట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ట్రెండీ దుస్తుల్లోనే ఊర్వశీ రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. ఈ డ్రెస్‌ను ఫిలిప్పిన్స్ ఫ్యాషన్ డిజైనర్ మైఖేల్ సీనోడిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె రెడ్ కార్పెట్‌పై నడుస్తుండగా, చేతిలో ఒక అందమైన చిలుక ఆకారపు మినీ బ్యాగ్‌తో కనిపించింది. జుడిత్ లీబర్ బ్రాండ్‌కు చెదిన ఈ బ్యాగ్ ఖరీదు రూ.4 లక్షలపైనే ఉండొచ్చని అంచనా.
ఐశ్వర్యారాయ్‌ను కాపీ!
ఊర్వశీ కేన్స్ రెడ్ కార్పేట్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమె బాలీవుడ్ సీనియర్ నటి ఐశ్వర్యారాయ్‌ను కాపీ కొట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 2018లో ఐశ్వర్య కూడా ఇదే స్ట్లైల్లో మల్టీ కలర్ గౌన్ ధరించిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అప్పటి ఫొటోలతో ఊర్వశ్వీ తాజా లుక్స్ పోల్చుతున్నారు. మరోవైపు, చిలుక ఆకారపు బ్యాగ్‌తో కేన్స్‌లో పాల్గొన్న తొలి సెలబ్రిటీ అని కూడా అంటున్నారు.
Cannes regular, Indian actress Urvashi Rautela walked the red carpet of Cannes Film Festival 2025, on Tuesday, May 13, for the opening ceremony and screening of the film Partir un jour (Leave One Day). She donned a multi-coloured outfit and accessorised her look with a tiara.… pic.twitter.com/pdZqYyJRLL
— Outlook India (@Outlookindia) May 13, 2025
ఏడాదికో ప్రత్యేకత!
గతంలోనూ ఊర్వశీ కేన్స్‌లో మెరిసింది. 2022 నుంచి కేన్స్‌లో పాల్గొంటున్న ఆమె ఫ్యాషన్ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. గతేడాది అయితే ఏకంగా రూ.105 కోట్ల విలువైన రెండు డ్రెస్సులను ధరించి ఆశ్చర్యపరిచింది. రెండు రోజులు జరిగిన రెడ్ కార్పెట్ ఈవెంట్లో తొలిరోజు పింక్ గౌన్ (రూ.47 కోట్లు) ధరించింది. ఇక నాలుగో రోజు బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ (రూ.58 కోట్లు) ధరించింది. ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు అని అప్పట్లో ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి!
కాగా, ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ రీసెంట్గా నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాలో కనిపించింది. ఈ సినిమా దబిడి దిబిడి పాటలో ఆమె డ్యాన్స్ స్టెప్పులు అప్పట్లో ఫుల్ ట్రెండ్ అయ్యాయి.
గాయంతో కేన్స్‌కు ఐశ్వర్య - డెడికేషన్ అలాంటిది మరి! - Cannes Film Festival 2024