Ranbir Kapoor First Wife : బాలీవుడ్ స్టార్ కపుల్‌గా రణ్‌బీర్ కపూర్- అలియా భట్ మంచి పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరూ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఏడాది నవంబరు 6న వారికి పండంటి ఆడబిడ్డ జన్మనివ్వగా, ఆమెకు 'రాహా' అని పేరు పెట్టారు. ఈ జంట సోమవారం మూడో వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. అయితే గతంలో ఓ సందర్భంగా మాట్లాడుతూ.. రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తన మొదటి భార్య కాదు అన్నారు. అప్పుడు చేసిన కామెంట్స్ వారి పెళ్లిరోజు సందర్భంగా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
'నా ఫస్ట్ వైఫ్ అలియా కాదు'
గతంలో ఓ హిందీ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రేజీ విషయం చెప్పారు రణ్‌బీర్ కపూర్. తనకు మొదటి భార్య అలియా కాదన్నారు. " నేను యాక్టింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒక క్రేజీ విషయం జరిగింది. అప్పుడు ఒక లేడీ ఫ్యాన్ పూజారితో వచ్చి నా ఇంటి గేటును పెళ్లి చేసుకుంది. నేను ఇంతవరకు ఆమెను కలవలేదు. మా ఇంటి వాచ్‌మ్యాన్ ఈ విషయం నాతో చెప్పాడు. ఆ బంగ్లాలో నేను మా తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడిని. ఈ సమయంలో గేట్‌పై తిలకం, కొన్ని పువ్వులు ఉండేవి. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. కాబట్టి అది చాలా క్రేజీగా అనిపించింది. నేను ఇంకా నా మొదటి భార్యను కలవలేదు. ఫ్యూచర్లో ఏదో ఒక సమయంలో మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను." అని రణ్‌బీర్ చెప్పారు.
నిజం ఒప్పేసుకున్న అలియా!
ఇదిలా ఉండగా, రణ్‌బీర్‌పై నాకు చాలా క్రష్ ఫీలింగ్ ఉండేదని అలియా చాలాసార్లు బహిరంగంగానే ఒప్పుకుంది. ఆయన్నే పెళ్లి చేసుకోవాలని ఉందని డేటింగ్‌కు ముందు కూడా పలుమార్లు తెలిపింది. తమ రిలేషన్ ఎలా మొదలైంది అనే విషయం కూడా ఓ సందర్భంలో ఆలియా వెల్లడించింది. "మా అక్కాచెల్లిల్లు, స్నేహితులు రణ్‌బీర్ నేను కలిసిఉంటామని చెప్పేవాళ్లు. ఒకరోజు ఫ్లైట్‌లో వెళుతుండగా మేము పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడే రణ్‌బీర్ సీటుకు సమస్య వచ్చింది. ఆ తర్వాత సీటును బాగుచేశారు. అప్పుడు మేము మొదటి సారి మాట్లాడుకున్నాం. ఆ వైబ్ అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత జరిగింది అంతా చరిత్రే" అని అలియా లిపింది.
మళ్లీ అలియా-రణ్‌బీర్ రీల్ జంట
అయితే, బ్రహ్మాస్త్ర పార్ట్ 1 షూటింగ్ సమయంలో అలియా, రణ్‌బీర్ డేటింగ్ మొదలైంది. వీరిద్దరూ లీడ్ రోల్స్ చేసిన బ్రహ్మాస్త్ర విజువల్ వండర్‌గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఈ రియల్ జంట మరో సారి రీల్ జంటగా కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో వస్తున్న లవ్ అండ్ వార్ సినిమాలో ఆడిపాడనున్నారు.