ETV Bharat / entertainment

విజయ్​ దేవరకొండ కింగ్​డమ్​ మూవీ వాయిదా - రిలీజ్ డేట్​​ ఎప్పుడంటే! - VIJAY DEVARAKONDA KINGDOM MOVIE

రౌడీ ఫ్యాన్స్​కు వెయిటింగ్​ తప్పేలా లేదు మరి!

Vijay Deverakonda Kingdom
Vijay Deverakonda Kingdom (Vijay Deverakonda Kingdom (Source : Film Poster))
author img

By ETV Bharat Telugu Team

Published : June 10, 2025 at 10:51 AM IST

1 Min Read

Vijay Devarakonda Kingdom Movie : రౌడీ హీరో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్​ డ్రామా 'కింగ్​డమ్​'. ఈ మూవీకి గౌతమ్​ తిన్ననూరి దర్శకుడు. పాన్​ ఇండియా చిత్రంగా రిలీజ్​ కాబోతున్న 'కింగ్​డమ్​' మూవీకి సంబంధించిన ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా జులై 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది.

అయితే అదే రోజు నితిన్​ 'తమ్ముడు' మూవీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తమ్ముడు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో​ కింగ్​డమ్ మూవీ జూలై 25న రిలీజ్ అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్​ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల రావాల్సి ఉంది.

స్పై యాక్షన్​ థ్రిల్లర్​గా 'కింగ్​డమ్' ​:

గౌతమ్​ తిన్ననూరి డైరెక్షన్​లో 'కింగ్​డమ్'​ మూవీ స్పై యాక్షన్​ థ్రిల్లర్​గా విడుదల కానుంది. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్, ఫార్య్టూన్ ఫోర్​ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్​ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్​గా నటించింది. అనిరుధ్ సంగీతం అందించారు.

ఇప్పటికే 'కింగ్​డమ్'​ మూవీ టీజర్​ రిలీజ్​ చేశారు. గ్లోబల్​ స్టార్​ ఎన్టీఆర్​ ఈ టీజర్​లో వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఎన్టీఆర్​ వాయిస్​, విజువల్స్​తో టీజర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. 'కింగ్​డమ్'​లో విజయ్​ పవర్​ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్​ చూస్తే అర్థం అవుతోంది. ఫుల్​ యాక్షన్​ మోడ్​లో ఉన్న టీజర్​ ఇప్పటికే 18 మిలియన్​ వ్యూస్​ దక్కించుకుంది. ఈ సినిమా నుంచి రిలీజ్​ అయినా 'హృదయం లోపల' సాంగ్​ 11 మిలియన్​ వ్యూస్​తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ సింగిల్​ యూత్​ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.

విజయ్ సినిమాలో స్టార్ హీరో- విలన్​ రోల్ అయితే కాదు!

అడగ్గానే తారక్ అన్న ఓకే అన్నారు, డైరెక్టర్ లేకున్నా వాయిస్ ఇచ్చారు: విజయ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.