Vijay Deverakonda Kingdom : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'కింగ్ డమ్'. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ వాయిస్‌తో రిలీజైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ టీజర్ తెర వెనుక సంగతులను షేర్ చేసుకున్నారు. టీజర్ కోసం వాయిస్ రాసినప్పుడే ఎన్టీఆర్ చెబితే బాగుంటుందని అనుకున్నట్లు విజయ్ తెలిపారు.
'టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసిన సమయంలోనే ఎన్టీఆర్ అన్న చెబితే బాగుంటుందని అనుకున్నాం. ఆయనను కలిసి ఈ విషయం చెప్పాను. కాసేపు మాట్లాడిన తర్వాత ఈ సాయంత్రమే చేసేద్దాం అన్నారు. డైరెక్టర్ చెన్నైలో ఉన్నారని, టీజర్‌కు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌లో బిజీగా ఉన్నారని చెప్పా. 'ఏం ఫర్వాలేదు. నువ్వు ఉన్నావ్‌గా' అని అన్నారు. ఆ డైలాగ్స్ ఆయనకు అంతగా నచ్చాయి. అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అన్నను అంతకుముందు నేను ఎక్కువ సార్లు కలవలేకపోయా. మా టీజర్‌కు వాయిస్ ఇవ్వడం ప్రత్యేకం అనిపించింది. హిందీ వెర్షన్ కోసం రణ్‌బీర్ కపూర్‌ని, తమిళ్ వెర్షన్ కోసం సూర్య సర్‌ని అడగ్గానే ఓకే చెప్పారు' అని విజయ్ గుర్తుచేసుకున్నారు.
సోదరుడి పాత్రలో స్టార్ హీరో
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ ఇందులో గెస్ట్ రోల్లో మెరవనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఈ సినిమాలో విజయ్ సోదరుడి పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఆయనది కూడా ఫుల్ లెంగ్త్ రోల్ అని తెలుస్తోంది. కథలో సత్యదేవ్‌కు కూడా ఫుల్ ఇంపార్టెన్సీ ఉంటుదని ఇన్సైడ్ టాక్. ఒక తెగకు సంబంధించిన నాయకుడిగా సత్యదేవ్ కనిపించనున్నారట. దీంతో గౌతమ్ తిన్ననూరి ఈ ఇద్దరు టాలెంటెడ్ హీరోలను స్క్రీన్‌పై ఎలా బ్యాలెన్స్ చేస్తారోనని ఆసక్తిగా మారింది.
కాగా, యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్య్టూన్ ఫోర్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మే 30న విడుదలకానున్న నేపథ్యంలో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ షురూ చేయనున్నారు.
కింగ్ డమ్' ట్రావెల్ టు శ్రీలంక- సమ్మర్లో కూలింగ్ మ్యాడ్నెస్ పక్కా!