Chhaava OTT : బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'ఛావా'. లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినమాకు దర్శతక్వం వహించారు. ఇటీవల రిలీజైన ఈ చిత్రం బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ తాజాగా బయటకు వచ్చింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఛావా డిజిటల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకుంది. ముందు నుంచి ప్రచారం సాగినట్లుగానే ఈ సినిమా ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ సోషల్ మీడియాలో గురువారం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 'ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఛావా స్ట్రీమింగ్ కానుంది' అని పోస్ట్ షేర్ చేసింది. కాగా, ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ. 700 కోట్ల (గ్రాస్) వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
Aale Raje aale 👑 Witness a tale of courage and glory etched in time 🔥⚔️
— Netflix India (@NetflixIndia) April 10, 2025
Watch Chhaava, out 11 April on Netflix. #ChhaavaOnNetflix pic.twitter.com/6BJIomdfzd
తొలుత హిందీలో రిలీజైన సినిమాకు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మార్చి 7న ఛావా తెలుగు వెర్షన్ విడుదల చేశారు. తెలుగులోనూ ఛావాకు మంచి స్పందన దక్కింది. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కలెక్షన్లు కూడా అదిరిపోయాయి. ఓవరాల్‌గా తెలుగులో ఇది రూ.20 కోట్ల (గ్రాస్ సాధించినట్లు) వసూళ్లు సాధించింది.
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం అధారంగా ఛావా రూపొందింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించారు. విక్కీ నటనకు సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఆయన భార్య యేసుబాయి పాత్రలో ప్రముఖ నటి రష్మిక మంధన్నా కనిపించారు. శంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా చేశారు. ఓవరాల్‌గా ప్రతి ఒక్కరూ తమతమ నటనకు ప్రశంసలు అందుకున్నారు. మ్యూజికల్ లెజెండ్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు.
జోరుమీదున్న 'ఛావా' - అక్కడ 'బాహుబలి 2' రికార్డులు బ్రేక్!
తెలుగులోనూ 'ఛావా' సెన్సేషన్- రూ.500 కోట్ల క్లబ్లో చేరిన మూవీ