Thug Life Movie Review: విడుదల తేదీ: 05-06-2025,నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, అశోక్ సెల్వన్, తనికెళ్ల భరణి, నాజర్, మహేశ్ మంజ్రేకర్,దర్శకుడు: మణిరత్నం,సంగీతం: ఎ.ఆర్. రెహ్మాన్,రచన: మణిరత్నం, కమల్ హాసన్
సినిమా స్టోరీ: శక్తిరాజు (కమల్ హాసన్) ఓ ముఠా నాయకుడు. ఓ కాల్పుల ఘటనలో అమర్ (శింబు) తన తండ్రిని చిన్నప్పుడే కోల్పోతాడు. శక్తిరాజు అతన్ని తన కొడుకులా చూసుకుంటాడు. ముఠాలో నాయకత్వం అమర్‌కు ఇవ్వడంతో ఇతర సభ్యుల్లో అసంతృప్తి మొదలవుతుంది. శక్తిరాజుపై హత్యాయత్నం జరుగుతుంది. తర్వాత శక్తి, అమర్ మధ్య విభేదాలు ఎలా పెరిగాయన్నదే కథాంశం.
సినిమా ఎలా ఉందంటే: మణిరత్నం గతంలో 'నాయకుడు', 'దళపతి' వంటి క్లాసిక్ గ్యాంగ్‌స్టర్ చిత్రాలను తెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమా కూడా అదే వాతావరణాన్ని మళ్ళీ సృష్టించడానికి ప్రయత్నించినా,స్టోరీలో కొత్తదనం కనిపించదు. మొదటి భాగం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, రెండో భాగం అంతగా ఆసక్తిగా అనిపించదు. పాత్రల మధ్య ఉన్న భావోద్వేగాల అంతగా గ్రహంచలేము. కొన్ని సన్నివేశాలు గందరగోళంగా ఉన్నాయి. అస్సలు అర్థం కావు. సినిమాకి ఇవే పెద్ద అడ్డుగా మారాయి.
ఎవరెలా చేశారంటే? : కమల్ హాసన్ యాక్షన్ అద్భుతంగా ఉంది. విభిన్న గెటప్పులు, ఎమోషనల్ డెప్త్‌తో మెప్పించారు. శింబు పాత్ర పరిమితంగా ఉండగా, త్రిష, అభిరామి పాత్రలు కథకు కొంత హైప్‌ని పెంచుతాయి. నాజర్, జోజు పాత్రలు అంత జోష్ని సంపాదించలేదు. కమల్ త్రిషాకి మధ్య సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇందులో హీరోయిన్ని అందంగా చూపించారు.
టెక్నికల్ సైడ్: రవి కె. చంద్రన్ విజువల్స్ సినిమాకే హైలైట్. రెహ్మాన్ మ్యూజిక్ అంత బాగాలేక పోయినా, కొన్ని పాటలు ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ (శ్రీకర్ ప్రసాద్) అంతగా పర్ఫెక్ట్గా లేదు. ఏదో మిస్ అవుతున్నా ఫీలింగ్ సినిమా చూస్తూవునంత సేపు అనినపిస్తుంది. మణిరత్నం ప్రభావం కొన్ని సీన్స్‌పైన మాత్రమే ఉన్నాయి.
- బలాలు: కమల్ హాసన్ నటన, ఆసక్తికరమైన ఫస్ట్ ఆఫ్.
- బలహీనతలు: తక్కువ గాఢత ఉన్న భావోద్వేగాల,ఊహించదగని కథనం, సన్నివేశాలు.
- చివరిగా: థగ్ లైఫ్- అక్కడక్కడా మెప్పిస్తుంది
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
మీరు ఓ అరుదైన రత్నం - ఇలాగే అద్భుతాలు సృష్టించాలి' - కమల్‌కు శ్రుతి స్పెషల్ విషెస్!