Upcoming Movies This Week : ఈ వేసవిలో బాక్సాఫీసు వద్ద వినోదం పంచేందుకు వరుసగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రతి వారం కొత్త చిత్రాలు థియేటర్లు/ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాగే ఈ వారం కూడా థియేటర్లు/ఓటీటీ సినీ ప్రియులకు వినోదం పంచడానికి సినిమాలు/సిరీస్‌లు సిద్ధమయ్యాయి.
ప్రముఖ నటుడు ప్రియదర్శి హీరోగా- దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందించిన చిత్రం 'సారంగపాణి జాతకం'. రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల థియేటర్లలో రిలీజ్ కానుంది. మనిషి భవిష్యత్తు అతడి చేతి రేఖల్లో ఉంటుందా? లేక అతడి చేతల్లో ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ చిత్రం తెరక్కెక్కింది. తన నమ్మకాలు, తాను ఇష్టపడిన అమ్మాయి ప్రేమ మధ్య కొట్టుమిట్టాడిన ఓ యువకుడి స్టోరీతో రూపొందుతోంది.
ఇంద్రరామ్ ప్రధాన కీలక పాత్రలో తెరకెక్కిన తిత్రం 'చౌర్య పాఠం'. 'చౌర్య పాఠం' అంటే దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదు- ఒక అవసరం కోసం దొంగతనం చేయాల్సి వస్తే, ఆ క్రమంలో హీరో ఏం పాఠం నేర్చుకుంటాడనే కథాంశమే మా చిత్రం' అని ఇంద్రరామ్ అన్నారు. నటి పాయల్ రాధా కృష్ణ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. నిఖిల్ గొల్లమారి తెరకెక్కించిన ఈ సినిమాను త్రినాథరావు నక్కిన నిర్మించారు. ఏప్రిల్ 25న ఈ మూవీ థియేటర్లో విడుదల కానుంది.
'ప్రేమలు'తో తెలుగులోనూ మంచి గుర్తించుపు తెచ్చుకున్నారు యువ నటుడు నస్లేన్ కె. గఫూర్. నస్లేన్ కథానాయకుడిగా నటించిన కొత్త చిత్రం 'జింఖానా'. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. బాక్సింగ్ కథాంశంగా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో నస్లేన్ తెలుగు సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
దీంతో పాటు గ్రౌండ్ జీరో, సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటించిన శివ శంభో, సూర్యాపేట జంక్షన్ అనే సినిమాలు 25 ఏప్రిల్ 2025న విడుదల కానున్నాయి.
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాల/సిరీస్‌లు ఇవే :
- జియో హాట్‌స్టార్
- ది రిహార్సల్స్ (ఇంగ్లీష్) సీజన్-1 - ఏప్రిల్21 నుంచి స్ట్రీమింగ్
- స్టార్‌వార్స్: యాండిర్ (ఇంగ్లీష్) సీజన్1 - ఏప్రిల్ 23 నుంచి స్ట్రీమింగ్
- ఎల్2: ఎంపురాన్ (తెలుగు) - ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్
- బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 23 నుంచి స్ట్రీమింగ్
- ఏ ట్రాజడీ ఫోర్‌టోల్డ్ ఫ్లైట్ 3054 (ఇంగ్లీష్) - ఏప్రిల్ 23 నుంచి స్ట్రీమింగ్
- యు: ది కిల్లర్ ఫైనల్ (మూవీ) - ఏప్రిల్ 24 నుంచి స్ట్రీమింగ్
- వీక్ హీరో (ఇంగ్లీష్) - ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్
- డిటెక్టివ్ కోనాన్ (యానిమేషన్) - ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్
- హ్యావోక్ (ఇంగ్లీష్) - ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్
- జ్యువెల్‌థీఫ్: ది హెయిస్ట్ బిగెన్స్ (హిందీ) - ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్
జీ5
- అయ్యన మానే (సినిమా)- ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్
సోనీలివ్
- షిర్డీ వాలే సాయిబాబా (సినిమా) - ఏప్రిల్ 21 నుంచి స్ట్రీమింగ్