Peddi Movie Digital Rights : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'పెద్ది'. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. 2026 మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే రీసెంట్గా సినిమా నుంచి మేకర్స్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ప్రేక్షకులకను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో రామ్‌చరణ్ లుక్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఓవరాల్‌గా ఈ చిన్న వీడియోతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
వీడియో గ్లింప్స్ రిలీజ్ తర్వాత 'పెద్ది'కి విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. దీంతో సినిమా నాన్ థియేట్రికల్ రైట్ దక్కించుకునేందుకు పలు ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్‌కు ఆయా సంస్థల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అయితే మరో మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ డీల్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఛాన్స్ ఎవరికో?
2018లో రిలీజైన 'రంగస్థలం' రామ్‌చరణ్ కెరీర్లో అత్యుత్తుమ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అప్పట్లో దీని ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే అమెజాన్‌లో హైయ్యెస్ట్ వ్యూవర్షిప్ దక్కించుకున్న సినిమాగా రంగస్థలం రికార్డ్ సృష్టించింది. అయితే 'పెద్ది' కూడా దాదాపు 'రంగస్థలం' సినిమాలాగే విలేజ్ బ్యాక్‌డ్రాప్ అవ్వడం, గ్లింప్స్‌కు క్రేజీ రెస్పాన్స్ రావడం వల్ల ఈ చిత్రాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అమెజాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కానీ, మేకర్స్ నెట్‌ఫ్లిక్స్ వైపే మొగ్గు చూపిస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. నెట్‌ఫ్లిక్స్ అయితే గ్లోబల్ వైడ్‌గా రీచ్ వస్తుందని భావించడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ నెట్‌ప్లిక్స్ ఆఫర్ మేకర్స్ అంచనాలు అందుకోలేదని టాక్ వినిపిస్తోంది. మరి చెర్రీ సినిమా హక్కులు ఏ సంస్థ దక్కించుకుంటుందో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే!
మ్యూజికల్ రైట్స్
కాగా, ఈ సినిమా మ్యూజికల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడయ్యాయి. టీ సిరీస్ (T Series) సంస్థ మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్నట్లు మేకర్స్ రివీల్ చేసేశారు. అయితే ఎంత మొత్తానికి దక్కించుకుందోనని మాత్రం వెల్లడించలేదు. కానీ, పెద్ది ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ రూ.25 కోట్లకు దక్కించుకున్నట్లు ఇన్సైట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే రామ్‌చరణ్ కెరీర్లో అత్యంత భారీ స్థాయిలో మ్యూజిక్ రైట్స్ అమ్ముడైన సినిమాగా 'పెద్ది' నిలుస్తుంది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, శివ రాజ్‌కు మార్, దివ్యేందు లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
'ఏదైనా నేల మీద ఉన్నప్పుడే సేసేయాలా'- పెద్ది గ్లింప్స్
'పెద్ది' మేనియా షురూ- చెర్రీ కెరీర్లోనే టాప్ మూవీగా రికార్డ్!