The Raja Saab Teaser : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ 'ది రాజా సాబ్'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాజాసాబ్ గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. మేకర్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మేకర్స్ చాలా రోజుల నుంచి ఎలాంటి అప్డేట్స్ షేర్ చేయలేదు. ఈ క్రమంలో టీజర్‌తో అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే నెలలోనే టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైట్ టాక్. అందుకోసం చిత్రబృందం ఇప్పటికే పనులు ప్రారంభించిందని తెలిసింది.
కాగా, ఈ సినిమా విడుదల ఎప్పుడనేది ఇంకా స్పష్టత లేదు. తొలుత ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, ఆ టైమ్‌కు సినిమా వచ్చే ఛాన్స్ లేదు. ఇదే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరులో కానీ విడుదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
రన్‌టైమ్ తగ్గించే పనిలో
ఇప్పటివరకు షూట్ చేసిన సినిమా మొత్తం 3 గంటల 30 నిమిషాల ఫుటేజ్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. 3 గంటలకు పైగా రన్‌టైమ్ అంటే హారర్ జోనర్‌లో రిస్క్ అని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఈ సినిమాని ఎడిట్ చేసి రన్‌టైమ్ తగ్గించే పనిలో మూవీ టీమ్ ఉందట.
పూర్తికాని షూటింగ్!
అంతేగాక రాజాసాబ్ సినిమాలో ఇంకా మూడు పాటలు షూట్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. కానీ హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ బిజీ షెడ్యూల్ వల్ల ఆ సాంగ్స్ షూటింగ్ పూర్తయ్యేసరికి మరికొంత సమయం పడుతుందని సమాచారం.
ఇక సినిమా విషయానికొస్తే, ప్రభాస్ తొలిసారి హారర్ నేపథ్యంలో ఉన్న సినిమాలో నటిస్తుండడం వల్ల అందరి దృష్టి 'ది రాజాసాబ్' పైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.