Thalapathy 69 Pooja Ceremony : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా 'గోట్'తో సక్సెస్ అందుకున్నారు. ఇతర భాషల్లో అంతగా టాక్ తెచ్చుకుని ఈ చిత్రం తమిళంలో మాత్రం బ్లాక్‌బస్టర్ వసూళ్లతో దూసుకెళ్లింది. అయితే ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న దళపతి తన అప్‌కమింగ్ మూవీలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. 'దళపతి 69' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో ప్రధాన నటీనటులతో పాటు మిగతా మూటీ టీమ్ కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
#Thalapathy69 Aarambam 💥🔥 pic.twitter.com/kphWi0CFuv
— Christopher Kanagaraj (@Chrissuccess) October 4, 2024
SET 2 is here 🔥
— KVN Productions (@KvnProductions) October 4, 2024
Paththala dhane? SET 3 erakiruvoma?#Thalapathy69Poojai#Thalapathy @actorvijay sir #HVinoth @thedeol @prakashraaj @menongautham #Priyamani @itsNarain @hegdepooja #MamithaBaiju @anirudhofficial @Jagadishbliss @LohithNK01 @sathyaDP @ActionAnlarasu @Selva_ArtDir… pic.twitter.com/VKFV5MPTZE
అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికరమైన విషయం జరిగింది. అదేంటంటే ఈ ఈవెంట్‌కు హాజరైన శివ అనే నిర్మాత విజయ్‌కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. 'GOAT' అని రాసి ఉన్న ఓ గోల్డ్ రింగ్‌ను ఆయనకు బహూకరించారు. దాన్ని అందుకున్న విజయ్ ఆ రింగ్‌ను వేసుకుని ఫొటోలు దిగారు. అందులో విజయ్ న్యూ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు.
Exclusive: Popular producer Amma Creations @TSivaAmma (who also acted in The GOAT) has presented this beautiful GOAT ring for the Mega blockbuster success of #TheGreatestOfAllTime to #ThalapathyVijay @actorvijay today at #Thalapathy69 Pooja 💐💐 pic.twitter.com/35aAIxNoxi
— Rajasekar (@sekartweets) October 4, 2024
'దళపతి 69' నటీనటులు వీరే!
ఇక 'దళపతి 69'లో నటించనున్న తారాగణం గురించి మేకర్స్ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు. ఇందులో విజయ్ సరసన పూజాహెగ్డే నటిస్తుండగా, బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా మెరవనున్నారు. వీరితో పాటు గౌతమ్ వాసుదేవ్ మేనన్, మమితా బిజు, ప్రియమణి, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మితవ్వనున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూట్ శనివారం నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
అయితే విజయ్ గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇకపై సినిమాలకు దూరంగా ఉంటానంటూ గతంలోనే ప్రకటించారు. దీంతో 'దళపతి 69' తర్వాత ఆయన సినిమాలు చేయకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు.
డైరెక్టర్‌గా విజయ్ దళపతి కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫస్ట్ మూవీ! - Vijay Thalapathy Son Movie
ది గోట్ 2.59 గంటల సినిమా కాదు! - అసలు రన్ టైమ్ ఎంతంటే? - Vijay The Goat Movie