Bigg Boss Sanjana: బిగ్ బాస్ కంటిస్టెంట్‌కు సుప్రీంకోర్టు నోటీసులు! - హౌజ్ లో ఖేల్ ఖతమైనట్టేనా?
- సంజనా గేమ్ కంటిన్యూ చేస్తుందా? లేదా? - ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్! - ఇంతకీ ఆ నోటీసుల్లో ఏముంది?

Published : September 28, 2025 at 2:13 PM IST
SC Notices to Heroine Sanjana: బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్లో "సంజనా గల్రానీ" వన్ ఆఫ్ ది ఫేవరెట్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. హౌస్‌లోకి అడుగుపెట్టినప్పుడు 'ఆ.. ఏం ఆడుతుందిలే' అనుకున్న వారంతా 'అబ్బ.. ఏం ఆడుతుందిగా!' అనేలా తన గేమ్‌ను మార్చుకుంది. గుడ్డు దొంగతనం చేయడం, కెప్టెన్‌గా ఎంపిక కావడం మొదలు ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఫస్ట్ వీక్ అల్లాడించింది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే గుడ్డు దొంగిలించిందో అప్పుడే ప్రేక్షకుల దృష్టిలో పడింది. దీంతో మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్నప్పటికీ.. అన్-అఫీషియల్ ఓటింగ్‌లో దుమ్ము రేపి సేఫ్ అయ్యింది.
ఇక, మూడో వారంలో మిడ్ వీక్‌లో కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యి సీక్రెట్ రూమ్‌కు వెళ్లిన ఈ అమ్మడు.. నలుగురి త్యాగంతో మళ్లీ హౌజ్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇలా సీజన్లో టాప్ మోస్ట్ కంటిస్టెంట్ గా ఉన్న సంజనాకు షాకిచ్చే సంఘటన చోటు చేసుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆమెకు నోటీసులు జారీ చేసింది. దీంతో సంజనా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతుందా? అని ఫ్యాన్స్‌తోపాటు ఇతర ఆడియెన్స్ కూడా అయోమయంలో ఉన్నారు. మరి, ఇంతకీ సుప్రీం కోర్టు ఎందుకు నోటీసులు జారీచేసింది? అందులో ఏముంది? సంజనా గేమ్ కంటిన్యూ చేస్తుందా? ఖేల్ ఖతమైనట్టేనా?? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఆ కేసులోనే :
కొవిడ్ టైమ్ (2020)లో కర్ణాటకలో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టించింది. ముఖ్యంగా సంజనపై కొకైన్, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి మత్తు పదార్థాల వినియోగంతోపాటు పంపిణీ చేశారనే అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆమెపై 3 కేసులు ఫైల్ అయ్యాయి. సినీ నటి రాగిణి ద్వివేదితోపాటు హీరోయిన్ సంజనను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణల కారణంగా జైలు జీవితం గడిపిన ఆమె రెండు నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు.
అయితే 2024 మార్చి 25న కర్ణాటక హైకోర్టు ఈ కేసును సాంకేతిక కారణాలతో రద్దు చేసింది. సెక్షన్ 219 CrPC ప్రకారం 12 నెలల వ్యవధిలోనే మూడు కంటే ఎక్కువ నేరాలపై విచారణ ఒకే ట్రయల్‌లో జరపలేమని ఆ సమయంలో తెలిపింది. దీంతో సంజనకు ఉపశమనం లభించింది. అయితే ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం తాజాగా సంజనాకు నోటీసులు పంపించింది. ఈ కేసు గురించిన పూర్తి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది.
హౌస్‌లో కొనసాగుతుందా?:
అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ బిగ్‌బాస్ హౌస్ లో ఉండటంతో.. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. కేసు గురించి వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో "సంజనాను హౌస్ నుంచి బయటికి పంపిస్తారా? లేదా??" అనే ప్రశ్న ఆడియన్స్‌లో ఆసక్తి రేపుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. "సంజనా టాప్ కంటెస్టెంట్ కాబట్టి ఆమెను బయటికి పంపిస్తే గేమ్ మారుతుంది", "సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినా టైమ్ ఉంటుంది కాబట్టి ఆమె ఇంట్లోనే ఉంటుంది", "సంజనాతో సంబంధం లేకుండా ఆమె లాయర్లు దీని గురించి వివరణ ఇస్తారు" అంటూ ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Bigg Boss Telugu 9 Day 20 Episode: "ఆమె సైడ్" తీసుకున్న బిగ్ బాస్ షో! - నెట్టింట భారీ ట్రోలింగ్!

