Single Movie OTT : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు లేటేస్ట్ మూవీ 'సింగిల్' మే 9న వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. దర్శకుడు కార్తిక్ రాజు తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయం దక్కించుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పడెప్పుడు వస్తుందా అని మూవీ లవర్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురింపించిన ఈ సినిమా ఇక ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ మంచి ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మూవీని జూన్ 6 నుంచి స్ట్రీమింగ్కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిసింది. థియేటర్లలలో మంచి విజయం సాధించిన ఈ చిత్రానికి ఓటీటీలోనూ భారీ స్పందన వస్తుందని మూవీటీమ్ భావిస్తోంది. తాజా వార్తతో మూవీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
కాసుల వర్షం
తొలి రోజు నుంచే సినిమాకు మంచి టాక్ రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.24 కోట్లు (గ్రాస్) వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అటు ఓవర్సీస్లోనూ 'సింగిల్' సత్తా చాటింది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో అదరగొట్టింది. 12 రోజుల్లో ఈ సినిమా 7 లక్షల డాలర్లు వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
700K+ Reasons to Laugh 😂🔥#Single continues its unstoppable run in the USA 🫶❤️
— V Cinemas (@VcinemasUS) May 22, 2025
Unstoppable vibes. Non-stop laughs.
Book your tickets now and join the madness! 🙏🤩
USA Release By @VcinemasUS #Single #SingleMovie @sreevishnuoffl @GeethaArts @KalyaFilms pic.twitter.com/CXEkLp1kax
కాగా, ఈ సినిమాను డైరెక్టర్ కార్తిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ జానర్లో ఉన్న ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకుంది. యంగ్ హీరోయిన్లు కేతిక శర్మ, ఇవాన కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నటులు వెన్నెల కిషోర్, వీటివీ గణేశ్ ఆయా పాత్రల్లో కనిపించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్, కాల్య ఫిల్మ్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, విద్య, భాను ప్రతాప సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.