ETV Bharat / entertainment

గోల్డెన్ గౌనులో 'శోభిత' షైనింగ్- తయారీకే 1600 గంటలు- మరి రేటు ఎంతో? - SOBHITA DHULIPALA GOLDEN GOWN

గోల్డెన్ కలర్ గౌనులో అదరగొట్టిన శోభిత ధూళిపాళ్ల- దాన్ని డిజైన్ చేయడానికి 1600 గంటల సమయం

Sobhita Dhulipala Golden Gown
Sobhita Dhulipala Golden Gown (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 19, 2025 at 6:08 PM IST

2 Min Read

Sobhita Dhulipala Golden Gown : అందం, అభినయంతో ఆకట్టుకున్న నటి శోభిత ధూళిపాళ్ల. మోడల్​గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె చేసింది తక్కువే సినిమాలే అయినా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఇటీవలే శోభిత వేసుకున్న ఓ గౌను నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

గౌను తయారీకి 1600 గంటలు
శోభిత రీసెంట్​గా ఓ ఈవెంట్​కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన గోల్డ్ కలర్ గౌనును ధరించి సందడి చేశారు. ఆ గౌనులో శోభిత క్లాస్​ లుక్​లో కనిపించి, ఈ వెంట్​లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. అయితే ఈ సంప్రదాయ ఎంబ్రాడరీ, మోడ్రన్ స్టైల్​లో ఉన్న గౌను డిజైన్ చేయడానికి ఏకంగా 1600 గంటలు పట్టిందట. అంటే 66 రోజులకు పైగా సమయం పట్టిందన్నమాట. దీంతో శోభిత ధరించిన గౌను గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ డ్రెస్ ధర కూడా భారీ మొత్తంలోనే ఉంటుందని తెలుస్తోంది.

గౌన్ స్పెషాలిటీ!
గోల్డెన్ కలర్​ షైనింగ్​గా ఉన్న గౌనులో శోభిత చూపరులను ఆకట్టుకుంటున్నారు. స్టైలిష్ లుక్​లో ఆమె అదిరిపోయారని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ గౌను తయారీకి ఫాబ్రిక్​ గ్లాస్ బగల్ బీడ్స్, ముత్యాలు ఇంకా మరికొన్ని లోహాలను ఉపయోగించి రూపొందించారు.

కెరీర్ విషయానికొస్తే
ఇక శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్​గా నిలిచారు. 2016లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తోన్న ఆమె హాలీవుడ్​లోనూ అవకాశాలు అందుకుంటూ కెరీర్​​లో ముందుకెళ్తున్నారు.

ప్రేమ వివాహం
అక్కినేని నాగచైతన్య, శోభిత చాలా కాలం నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్​లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

గతేడాది డిసెంబరు 4న నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ వివాహ వేడుక జరిగింది. కాగా, 2017లో సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంతను నాగచైతన్య వివాహం చేసుకున్నారు. మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2021లో విడిపోయారు. ఆ తర్వాత శోభితను చై పెళ్లి చేసుకున్నారు.

శోభిత సలహా తీసుకున్నాకే ఆ వర్క్ చేస్తాను - తనకు అన్నీ ఈజీగా తెలుస్తాయి : నాగచైతన్య

పెళ్లికి ముందు ఫస్ట్​ టైమ్ అక్కడ కలిశాం - నా చేతికి చైతూ గోరింటాకు కూడా పెట్టారు : శోభిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.