ETV Bharat / entertainment

ఎవరీ శోభిత ధూళిపాళ్ల? - ఆమె గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు - మీకు తెలుసా? - Sobhita Dhulipala Biography

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 8, 2024, 1:30 PM IST

Sobhita Dhulipala : సినీ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం.. ఇరు కుటుంబాల సమక్షంలో వైభవంగా సాగింది. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలింది పెళ్లి బాజాలు మాత్రమే! అయితే.. ఈ వార్త బయటకు వచ్చినప్పట్నుంచి శోభిత ధూళిపాళ్ల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు? ఫ్యామిలీ బ్యాగ్రౌండ్​ ఏంటి? అని సెర్చ్​ చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..

Sobhita Dhulipala
Sobhita Dhulipala Biography (Etv Bharat)

Sobhita Dhulipala Biography: శోభిత ధూళిపాళ్ల.. ప్రస్తుతం సోషల్​ మీడియాలో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈమె తెలుగులో ఓ రెండు మూడు సినిమాలు చేసినట్టు మాత్రమే చాలా మందికి తెలుసు. అయితే.. అక్కినేని నాగచైతన్యతో ఎంగేజ్​ మెంట్​ జరగడంతో.. ఈమె గురించిన పూర్తి సమాచారం కోసం ఆన్​లైన్​లో వెతుకుతున్నారు నెటిజన్స్. మరి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలుగింటి అమ్మాయే: చూడటానికి ఇంటర్నేషనల్​ మోడల్‌లా కనిపిస్తున్న శోభిత.. అచ్చ తెలుగింటి అమ్మాయి. ఆంధ్రప్రదేశ్​లోని తెనాలిలో ఈమె జన్మించారు. 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు తెనాలిలో శోభిత జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గవర్నమెంట్ టీచర్‌. పదహారేళ్లూ వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగిన శోభిత.. వైజాగ్​లోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్​లో తన చదువు​ పూర్తి చేశారు. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారారు. అక్కడ ముంబయి యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్​లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలలో కూడా శిక్షణ తీసుకున్నారు.

చీరకట్టుకు 'వైజాగ్'​ పిల్ల మోడ్రన్​ టచ్​.. నడుమును విల్లుగా వంచుతూ.. హాట్​హాట్​గా..

తొలుత మోడల్​గా : శోభిత ధూళిపాళ్ల మొదట ఒక మోడల్​గా తన కెరీర్ మొదలుపెట్టారు. 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. "ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013" టైటిల్‌ను గెలుచుకున్నారు. ఆ తరువాత భారతదేశం తరపున "మిస్ ఎర్త్ 2013" పోటీల్లోనూ పాల్గొన్నారు. కానీ అక్కడ టైటిల్​ గెలవలేకపోయారు. ఆ తర్వాత 2016లో సినీ రంగ ప్రవేశం చేశారు.

మొదటి సినిమా ఇదే: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమెకు తొలిసారిగా సినిమాలో నటించే ఛాన్స్​ ఇచ్చారు. 2016లో తాను తీసిన "రామన్ రాఘవ్ 2.0" సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత అవకాశాలను దక్కించుకున్నారు. తెలుగులో ఆమె అడివి శేషుతో కలిసి గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న శోభిత.. ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ "ద నైట్ మేనేజర్"లో అనిల్ కపూర్ భార్యగా నటించారు. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటించారు. అంతేకాకుండా ఇటీవల ప్రభాస్​ నటించిన కల్కి సినిమాలో కూడా శోభిత భాగమైంది. అందులో దీపికా పదుకొణెకు వాయిస్ ఇచ్చారు. ప్రస్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు.

గతంలోనే వైరల్ ​: నాగచైతన్య - శోభిత రిలేషన్​ గంతంలోనే వైరల్ అయ్యింది. వారిద్దరూ కలిసి బయటికి వెళ్లినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ కావడంతో.. రిలేషన్​షిప్​లో ఉన్నారని నెటిజన్లు భావించారు. వారిద్దరికీ నిశ్చితార్థం జరగబోతోందని సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా న్యూస్ వైరల్​ కావడంతో.. శోభిత గురించి శోధించే వారి సంఖ్య పెరిగిపోయింది. మొత్తానికి వీరికి నిశ్చితార్థం జరిగిందని నాగార్జున అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు.

Sobhita Dhulipala Marriage : శోభితకు 'భర్త'గా అలాంటి అబ్బాయే కావాలట!

నాగ చైతన్యతో డేటింగ్​.. అసలు విషయం చెప్పిన శోభిత.. ఆ తప్పు చేయలేదంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.