
'గ్యారెంటీ, వారంటీ ఇవ్వడానికి నేను సేల్స్‌మెన్ కాదు'- క్రేజీగా తెలుసు కదా ట్రైలర్
సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా ట్రైలర్ ఔట్- మీరు చూశారా?

Published : October 13, 2025 at 3:01 PM IST
Telusu Kada Trailer : సిద్ధు జొన్నలగడ్డ హీరోగా డిజైనర్ నీరజ కోన తెరకెక్కించిన సినిమా తెలుసు కదా. ఈ సినిమాతోనే నీరజ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైవా హర్ష కీలక పాత్ర పోషించారు. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో మేకర్స్ సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ రిఫ్రెషింగ్ స్టోరీ లైన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా సినిమా రానుంది. అయితే ట్రైయాంగిల్ లవ్ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. హీరో డైలాగులు సినిమాకు హైలైట్ కానున్నాయి. 'ఎవరిని ప్రేమించాలి? ఎంత ప్రేమించాలి' అంటూ తన ఫ్రెండ్ క్యారెక్టర్ హర్షతో హీరో చెప్పిన డైలాగ్ చూస్తుంటే లవ్‌లో విసిగిపోయినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా ట్రైలర్ కట్ బాగుందని మూవీ లవర్స్ అంటున్నారు. మరి సినిమా ఎలా ఉండనుందో తెలియాలంటే ఆక్టోబర్ 17న దాకా ఆగాల్సిందే!
అలాగే మూవీటీమ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా ప్రెస్మీట్లో కూడా పాల్గొంది. ఇందులో హీరో పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు లేవని, ఒక్క ముద్దు సీన్ కూడా ఉండకూడదు అని ముందుగానే డైరెక్టర్ నీరజకు సిద్ధు చెప్పారట. ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ అని అన్నారు.
ప్రతిసారీ ఇద్దరు హీరోయిన్లతోనే ఎందుకు చేస్తున్నారు?
సిద్ధు: ఇద్దరు హీరోయిన్లతో నేను ఇప్పటివరకు చేసింది ఒకే సినిమా. అది కృష్ణ అండ్ హిజ్ లేడీ. అందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఇక టిల్లు స్క్వేర్ లో అయితే అందులో ఇంకో హీరోయిన్‌ది గెస్ట్ రోల్ అంతే
దీపావళి పండక్కి పోటీ ఎక్కువగా ఉంది. అప్పుడు రిలీజ్ చేయడం రిస్క్ అనుకోవడం లేదా?
సిద్ధు: రిస్క్ ఉన్న దగ్గరే గెలుపు ఉంటుంది. నా గత సినిమా ఆశించిన రేంజ్లో ఆడలేదు. ఒక సినిమా నన్ను కింద పడేస్తే, మరొ చిత్రం కమ్‌బ్యాక్ ఇస్తుందని నమ్ముతాను
సిద్ధుతో రొమాంటిక్ సినిమా తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
నీరజ కోన : సిద్ధు అయితేనే ఈ కాన్సెప్ట్‌కు న్యాయం చేయగలరని అనిపించింది. ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాం
కాగా, ఈ సినిమా విషయానికొస్తే డైరెక్టర్ నీరజ కోన టాలీవుడ్ ప్రముఖ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచమయ్యారు. బాద్‌షా సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని శారు. ఇప్పుడు నీరజ దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన మల్లిక గంధ పాటకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను కృతిప్రసాద్ నిర్మించారు.
'జాక్' ఎఫెక్ట్- 4.75 కోట్లు రిటర్న్ ఇచ్చేసిన సిద్ధు- లోన్ తీసుకొని మరీ!
ప్రభాస్ x సిద్ధు జొన్నలగడ్డ - 'రాజాసాబ్' రిలీజ్ రోజే ఆ సినిమా కూడా!

