ETV Bharat / entertainment

సమంత కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ మూవీస్ ఇవే! - SAMANTHA TOP MOVIES

కెరీర్​లో దూసుకెళ్తున్న సమంత- ఆమె కెరీర్​లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఏవంటే?

Samantha Top 10 Movies
Samantha Top 10 Movies (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 28, 2025 at 2:24 PM IST

2 Min Read

Samantha Top Movies Collections : దక్షిణాదితో పాటు బాలీవుడ్​లోనూ తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు స్టార్ హీరోయిన్ సమంత. ఈ ముద్దుగుమ్మ అనేక హిట్ సినిమాల్లో నటించారు. సోమవారం (ఏప్రిల్ 28న) 38వ పడిలోకి అడుగుపెట్టారు సామ్. ఈ సందర్భంగా ఆమె కెరీర్​లో ఎక్కువ వసూళ్లు రాబట్టిన టాప్-10 సినిమాలేవో తెలుసుకుందాం.

1. మెర్సల్ : తమిళ హీరో విజయ్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'మెర్సల్' (తెలుగులో అదిరింది). ఈ సినిమాను రూ.120 కోట్ల బడ్జెట్​తో దర్శకుడు అట్లీ తెరకెక్కించగా, రూ.257 కోట్లు వసూళ్లను సాధించింది.

2. రంగస్థలం : మెగా పవర్​స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కిన మూవీ 'రంగస్థలం'. ఈ సినిమాలో సమంత హీరోయిన్​గా నటించారు. రూ.80 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ మూవీ రూ.217 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

3. తేరీ : దళపతి విజయ్, సమంత కాంబినేషన్​లో తెరకెక్కిన మూవీ 'తేరీ' (తెలుగులో పోలీసోడు). ఈ సినిమాను అట్లీ రూ.75 కోట్లతో తెరకెక్కించగా రూ.153కోట్ల వసూళ్లను సాధించింది.

4. జనతా గ్యారేజ్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ 'జనతా గ్యారేజ్'. ఇందులో సమంత హీరోయిన్​గా కనిపించారు. ఈ మూవీ బడ్జెట్ రూ.60కోట్లు. బాక్సాఫీసు వద్ద భారీ ఘనవిజయాన్ని సొంతం చేసుకుని రూ.135 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

5. అత్తారింటికి దారేది : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ ఈ మూవీని రూ.55కోట్ల బడ్జెట్ లో తీశారు. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఏకంగా రూ.134కోట్లను వసూల్ చేసింది.

6. కత్తి : దళపతి విజయ్, సమంత కాంబోలో రూపొందిన మూవీ 'కత్తి'. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. రూ.65 కోట్లలో తీసిన ఈ మూవీ రూ.126 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

7. 24 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, సమంత లీడ్ రోల్​లో తెరకెక్కిన సినిమా '24'. ఈ మూవీని విక్రమ్ కె కుమార్ రూ.75 కోట్ల బడ్జెట్​తో తీశారు. ఈ మూవీ పాజిటివ్ టాక్ ను దక్కించుకుని రూ.108 కోట్లను కొల్లగొట్టింది.

8. ఈగ : దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మూవీ 'ఈగ'. ఈ సినిమాలో నాని, సమంత, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ రూ.45 కోట్లతో తెరకెక్కి రూ.102 కోట్ల వసూళ్లను సాధించింది.

9. దూకుడు : సూపర్ స్టార్ మహేశ్, శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన మూవీ 'దూకుడు'. ఇందులో సమంత కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రూ.35 కోట్లతో తెరకెక్కి, ఏకంగా రూ.101 కోట్ల కలెక్షన్లను వసూల్ చేసింది.

10. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : సూపర్ మహేశ్, విక్టరీ వెంకటేశ్ కాంబోలో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన మూవీ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఇందులో సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. రూ.45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.92కోట్లు వసూల్ చేసింది.

'నా సమస్య ఎవరికీ రాకూడదు' - అనారోగ్యంపై సమంత ఆవేదన

లీడ్ రోల్​ కంటే ముందు అతిథిగా మెరవనున్న సామ్! - ఆ సినిమాలో తన పాత్ర వెరీ స్పెషల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.