Samantha On Success : తన జీవితంలో గతం కంటే ఇప్పుడు ఎక్కువ సక్సెస్‌ను సొంతం చేసుకున్నట్లు హీరోయిన్ సమంత తెలిపారు. తన దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛగా ఉండడమని చెప్పారు. సమంత ప్రధాన పాత్రలో సినిమాలు వచ్చి దాదాపు రెండేళ్లు అవుతుండగా, తాను విరామం తీసుకోవడం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. విరామం తీసుకున్న తర్వాత విజయానికి నిర్వచనం మారిందని అర్థమైందన్నారు.
"విజయానికి సీక్రెట్ ఏంటంటేస్వేచ్ఛ అని చెబుతాను. జీవితంలో అభివృద్ధి చెందడం, పరిణితి సాధించడం, బందీగా ఉండకపోవడమే నా దృష్టిలో స్వేచ్ఛ అదే నా విజయం. గత రెండు సంవత్సరాలుగా నా సినిమా విడుదల కాలేదు. అయితే ఈ విరామం సమయంలో నేను చాలా స్వేచ్ఛగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లు గతంలో పోలిస్తే నేనిప్పుడు విజయం సాధించానని అనుకోవడం లేదు. కానీ నా దృష్టిలో నేను గతం కంటే ప్రస్తుతం ఎక్కువ సక్సెల్‌ఫుల్‌గా ఉన్నాను. నేను చేసే ఎన్నో పనులు నాకు ఉత్సాహానిస్తున్నాయి. వాటిని పూర్తిచేయడం కోసం నేను ప్రతిరోజు ఆనందంగా నిద్ర లేస్తున్నాను" అని సమంత ఇంటర్వ్యూలో మాట్లాడారు.
సమంత సినిమాల పరంగా బిగ్స్క్రీన్పై పూర్తిస్థాయిలో కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇటీవల వచ్చిన శుభం మూవీలో మాతాజీ అనే అతిథి పాత్రలో కనిపించారు. ఆమె మొదటిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి శుభంతో మంచి ప్రశంసలు అందుకున్నారు. దానితోపాటు మా ఇంటి బంగారం అనే సినిమాను కొన్ని నెలల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వని సామ్, షూటింగ్ జూన్ నెలలోనే ప్రారంభం కానుందని రీసెంట్గా వెల్లడించారు.
రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌లో కూడా సామ్ ప్రస్తుతం యాక్ట్ చేస్తున్నారు. అందులో మహారాణి రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. 2025లోనే సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇకపై వరుసగా చిత్రాలతో మూవీ లవర్స్‌ను అలరిస్తానని ఇటీవల ఓ కార్యక్రమంలో తెలిపారు.