ETV Bharat / entertainment

'నా సమస్య ఎవరికీ రాకూడదు' - అనారోగ్యంపై సమంత ఆవేదన - SAMANTHA MYOSITIS HEALTH UPDATE

తన ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్డేట్ ఇచ్చిన సమంత! ఏం చెప్పిందంటే?

Samantha Myositis Health Update
Samantha Myositis Health Update (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 14, 2025 at 12:57 PM IST

2 Min Read

Samantha Myositis Health Update : సూపర్​ హిట్​ చిత్రాలతో టాలీవుడ్​ ప్రేక్షకులను అలరించిన అందాల తార సమంత మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ వ్యాధి గురించి పలు సందర్భాల్లో సమంత వెల్లడింటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యాధి గురించి మరోసారి చర్చించారు. ఆ వ్యాధి వల్ల తాను శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. తనలా ఎవరికీ జరగొద్దని కోరుకున్నారు.

'నిస్సహాయంగా అనిపించింది'
ఇటీవల ప్రముఖ యూట్యూబర్ ఫుడ్​ఫార్మర్​తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సమంత. అనంతరం తమ ఆరోగ్య పరిస్థితిపై అడిగిన ప్రశ్నపై మాట్లాడారు. తనకు మైయోసైటిస్​ ఉందని తెలిసినప్పుడు నిస్సహాయంగా అనిపించిందని తెలిపారు. తన ఆరోగ్యంతో ఏకాంతంగా ఉన్నట్లు అనిపించిందని చెప్పారు. "నాకు ఎక్కడినుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. ఎప్పుడైనా నువ్వు నీరసంగా ఉంటే, అప్పుడు వారం రోజుల కోసం ఒక మాత్ర వేసుకోవాలి. అప్పుడు బాగానే ఉన్నాననే ఫీలింగ్ నీకు వస్తుంది. ఎందుకంటే నీ లైఫ్​ అలానే సులభంగా ఉంటుంది!. కానీ ఇది(మయోసైటిస్) అలా కాదు. ఇది దీర్ఘ కాలిక వ్యాధి. ఈ సమస్యను బాగుచేయలేం అని, లైఫ్​ లాంగ్ ఉంటుందని, ఇంకా తీవ్రంగా మారుతుందని చెప్పినప్పుడు, నా జీవితం మొత్తం కళ్ల ముందు ప్రత్యక్షమైంది. లైఫ్​లో ప్రతీది ఆగిపోయింది. ఆ సమయంలో నాకు నిస్సహాయురాలును అయిపోయానని అనిపించింది." అని సమంత వెల్లడించింది.

'నా కెరీర్ ముగిసిపోయిందన్నారు'
అయితే ఈ వ్యాధి గురించి తెలిసిన తర్వాత కొందరు నా యాక్టింగ్ కేరీర్​ ముగిసిపోయిందన్నారని సమంత చెప్పారు. ప్లాన్​ బీకి మారాలని సూచించారన్నారు. " 'నీ ప్లాన్ బి ఏమిటి? నువ్వు ఇక నటిగా ఉండలేవు' అని అన్నప్పుడు దాన్ని నేను ఒప్పుకోలేదు. ఆప్షన్ బీ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి? అని ప్రశ్నించాను. ఆప్షన్ బీ ఏమీ లేదని నేను వారికి స్పష్టంగా చెప్పాను. నేను ఈ సమస్యను అధిగమించబోతున్నానన్నాను. అయితే అది కొద్ది నెలల్లో నయం కాదని నేను గ్రహించడానికి నాకు చాలా సమయం పట్టింది. ఈ వ్యాధి నయం కావాలంటే సంవత్సరాలు పడుతుంది. ఇది ఒంటరి ప్రయాణం. ఏదో ఒకరోజు అది చాలా కష్టం అవుతుందని నేను గ్రహించాను. నేను ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య ఎవరికీ రాకూడదని కోరుకుంటున్నాను." అని సమంత అన్నారు.

తనకు మయోసైటిస్​ నిర్ధరణ అయినప్పటి నుంచి తన ఆరోగ్య పరిస్థితిపై అప్టేట్లు ఇస్తోంది సమంత. ట్రీట్​మెంట్​ కోసం కొంతకాలం సినిమాలకు బ్రేక్​ ఇచ్చిన ఈ నటి అనంతరం వరుస సినిమాలు చేస్తోంది. చివరగా వరుణ్​ ధావన్​తో కలిసి సిటాడెల్​లో కనిపించింది. ప్రస్తుతం రాజ్​ అండ్​ డీకే వెబ్​ సిరీస్​ 'రక్త్ మార్తాండ్​ : ది బ్లడీ కింగ్​డమ్​'లో నటిస్తోంది సమంత.

'అలా చేసినందుకు -రూ.కోట్లలో నష్టపోయా!'- సమంత షాకింగ్ రివీల్​!

'వాళ్లు సెకండ్‌ హ్యాండ్‌ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.