Samantha Brand Endorsements : నటిగా, పబ్లిక్ ఫిగర్‌గా బాధ్యతాయుంతంగా నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది హీరోయిన్ సమంత. తాజాగా తాను బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు తీసుకోవడంలో తన బాధ్యతల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆయా బ్రాండ్లతో తన విలువలు అమరక గురించి తాను ఎలా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తుందో వెల్లడించింది. ఇతరుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. అందులో భాగంగా గతేడాది 15 బ్రాండ్లకు నో చెప్పానని వెల్లడించింది. అయితే దీని వల్ల రూ.కోట్లలో నష్టపోయినట్లు పేర్కొంది.
'అప్పుడు విజయం అంటే అదే'
"నేను నా 20 ఏళ్ల వయసులో ఈ పరిశ్రమలోకి ప్రవేశించాను. అప్పుడు, మన చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని బ్రాండ్‌లను ఆమోదించారు, ఎన్ని బ్రాండ్‌లు వారి ఉత్పత్తులపై మీ ముఖాన్ని కోరుకుంటున్నారు అనే దానిపై విజయం ఆధారపడి ఉండేది." అని సమంత అన్నారు.
'పాత సమంతకు నేను క్షణాపణ చెప్పాలి!'
"కానీ ఈ రోజు, నేను ఇంతకంటే తప్పుగా ఉండలేనని గ్రహించాను. నా ఎంపికలపై ఆత్మపరిశీలన చేసుకోవలసి వచ్చింది. అయితే సరైన మార్గాన్ని అనుసరించాలని నేను అనుకున్నాను. ఈ రోజు, అన్ని అర్ధం లేని పనులు చేసినందుకు ఇప్పుడున్న సమంతకు, పాత సమంత క్షమాపణ చెప్పాలని నేను భావిస్తున్నాను. అందుకే నా యంగ్ ఫాలోవర్స్‌కు- 20లలోనే తాము అజేయులమని అనుకోవద్దని విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. అది కాదని నేను నేర్చుకున్నాను! ఆ ఎండార్స్‌మెంట్‌లు చాలా కాలం క్రితం జరిగాయి. నేను గతేడాది దాదాపు 15 బ్రాండ్‌లను తిరస్కరించి వదులుకున్నాను. ఆ రూ.కోట్ల డబ్బు కూడా. ఇప్పుడు ఎండార్స్‌మెంట్ వచ్చిన ప్రతిసారీ, నేను దానిని ఆమోదించడానికి అంగీకరించే ముందు ముగ్గురు వైద్యులతో ఆ బ్రాండ్‌లను తనిఖీ చేస్తాను." అని సమంత వెల్లడించారు.
సమంత మెచ్చిన హీరోయిన్లు- లిస్ట్‌లో సాయి పల్లవి, అలియా
'వాళ్లు సెకండ్ హ్యాండ్ అన్నారు - అయినా రివెంజ్ తీసుకోలేదు' - విడాకులపై సమంత