ETV Bharat / entertainment

'బాంబులతో పేల్చేస్తాం'-సల్మాన్​కు మళ్లీ బెదిరింపులు- ఏడాది క్రితం ఇదే రోజున కాల్పులు - SALMAN KHAN DEATH THREAT

సల్మాన్​ ఖాన్​కు మరోసారి బెదిరింపులు- కాల్పులు జరిపిన ఏడాది తర్వాత మళ్లీ వార్నింగ్

Salman Khan
Salman Khan (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : April 14, 2025 at 10:39 AM IST

Updated : April 14, 2025 at 10:52 AM IST

2 Min Read

Salman Khan Death Threat : బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్​ను మరోసారి బెదిరింపులు వచ్చాయి. అయితే గతంలో పలుమార్లు డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరించిన దుండగులు ఈసారి మాత్రం ఆయన కారును పేల్చేస్తామంటూ పేర్కొన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇదే రోజు ముంబయిలోని ఆయన ఇంటిపై పలువురు కాల్పులు జరిపారు. కాగా, సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ కారు పేల్చేస్తామంటూ బెదిరింపు సందేశాలు పంపడం బీ టౌన్​లో​ కలకలం సృష్టిస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అయితే సోమవారం సల్మాన్ ఖాన్​కు వాట్సాప్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఆయన ఇంట్లోనే సల్మాన్​ను చంపేస్తామంటూ సందేశం పంపారు. బాంబుతో తన కారు పేల్చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. వర్లీకి చెందిన ఓ ట్రాన్స్​పోర్ట్​ డిపార్ట్​మెంట్ అఫీషియల్ నెంబర్​కు ఈ మెసేజ్ వచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వర్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

సరిగ్గా ఏడాది కిందట!
కాగా, 2024 ఏప్రిల్ 14 సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిగాయి. ఆయన నివాసం ఉంటున్న ముంబయిలోని బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత ఈ కేసు విషయంలో ఇద్దరు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. అంతేకాదు ఈ ఘటన వెనక గ్యాంగ్ స్టర్ లారెస్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అప్పుట్లోనే ప్రకటించారు.

హీరో సల్మాన్‌ ఖాన్​కు బెందిరింపులు ఆగడం లేదు. కొంతకాలంగా చంపైస్తామంటూ వార్నింగ్స్ వస్తున్నాయి. గతంలో పలుమార్లు ఫేస్​బుక్, ఈ మెయిల్స్, వాట్సాప్ ద్వారా బెదింపులకు పాల్పడ్డారు. ఈ బెదిరింపులు నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఆయనకు వై ప్లస్‌ సెక్యురిటీని నియమించింది. ఆయన భారీ భద్రతతోనే షూటింగ్స్‌, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై పోలీసులు మమ్ముర దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు మరోసారి బెదిరింపులు రావడం బీ టౌన్​లో​ కలకలం సృష్టిస్తోంది.

సల్మాన్ ఖాన్​ బెదిరింపుల కేసు - 24 ఏళ్ల సాంగ్ రైటర్​ అరెస్ట్​

బాబా సిద్ధిఖీని చంపింది మేమే - లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటన!

Last Updated : April 14, 2025 at 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.