ETV Bharat / entertainment

ఆస్కార్​లో 'RRR'కు మరో గౌరవం- ఇకపై వాళ్లకు కూడా అవార్డులు - OSCARS 2026

ఆస్కార్​లో కొత్త కేటగిరీ- ఇకపై వాళ్లకు కూడా అవార్డులు

Oscars New Category
Oscars New Category (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 11, 2025 at 11:00 AM IST

2 Min Read

Oscars New Category: సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. కెరీర్​లో ఒక్కసారైనా ఆస్కార్ దక్కించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు, కళాకారులు కోరుకుంటారు. అయితే ఈ అవార్డుల్లో ఇప్పుుడు మరో కొత్త కేటగిరీ యాడ్ అయ్యింది. ఇకపై 'స్టంట్‌ డిజైన్‌' విభాగంలోనూ అవార్డులు ఇవ్వనున్నట్లు అకాడమీ అధికారికంగా ప్రకటించింది. 100వ అకాడమీ అవార్డుల్లో ఈ కేటగిరీని అధికారికం చేయనున్నట్లు తెలిపారు.

దీనిపై అకాడమీ నిర్వాహకులు స్పందించారు. టాలెండటెడ్ టెక్నిషియన్లను ఈ విభాగంలో చేర్చడం గర్వంగా ఉందని వెళ్లడించారు. 'సినిమా ప్రారంభం నుంచి చిత్ర నిర్మాణంలో 'స్టంట్‌ డిజైన్‌' భాగంగా ఉంది. క్రియేటివిటీ కలిగిన ఆర్టిస్ట్​లను ఈ కేటగిరీలో వినూత్నంగా గౌరవించడం మాకు గర్వంగా ఉంది' అని పేర్కొన్నారు. కాగా, 2027 నుంచి విడుదల కానున్న సినిమాలకు ఈ జాబితాలో ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు. దీనిపై సినీ ప్రముఖలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'గుడ్ డెసిషన్' అని అంటున్నారు.

RRRకు గౌరవం
అయితే కొత్త కేటగిరీని ప్రకటించే క్రమంలో ఆస్కార్ ఓ పోస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో మూడు సినిమాల ఫొటోలు ఉన్నాయి. అందులో ఒకటి 'ఆర్ఆర్ఆర్' ఫొటో కావడం విశేషం. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్​లో రామ్​చరణ్ పులితో ఫైట్ చేసే సీన్​లోని ఓ షాట్​ను ఆస్కార్ ఉపయోగించింది. మూడు సినిమా పోస్టర్లతో 'స్టంట్‌ డిజైన్‌' గురించి ఆస్కార్ వెల్లడించింది. 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'మిషన్‌ ఇంపాజిబుల్‌' సినిమాల్లోని స్టంట్స్ ఫొటోలతో దీన్ని ప్రకటించింది.

ఆస్కార్ కొత్త కేటగిరీ ప్రకటించే క్రమంలో మన తెలుగు సినిమా పోస్టర్ వాడడంతో టాలీవుడ్ ఆడియెన్స్​ ఆనందిస్తున్నారు. ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవం అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్​ 2022లో బ్లాక్​బస్టర్ విజయం దక్కించుకుంది. వరల్డ్​వైడ్​గా రూ.1200+ కోట్ల వసూళ్లు సాధించింది. అంతేకాకుండా 2023లో 'నాటు నాటు' పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీ ఆస్కార్‌ సాధించింది.

ఆస్కార్ వేదికపై మరోసారి 'నాటు నాటు'- టాలీవుడ్ రేంజ్​ అట్లుంటది మరి

ఆస్కార్ విన్నర్ 'అనోరా'- ఏ OTTలో చూడొచ్చంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.