Ramayan Ranbir Kapoor Dual Role : బాలీవుడ్లో తెరకెక్కుతోన్న అతిపెద్ద ప్రాజెక్ట్ 'రామాయణ'. ఎలాంటి అధికారిక లాంఛ్ లేకుండా షూటింగ్‌ను గుట్టుచప్పుడు కాకుండా శరవేగంగా చేసుకుంటూ పోతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఇది ముస్తాబవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సీతారాములుగా రణ్‌బీర్, సాయి పల్లవి లుక్స్ కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ రామాయణలో ఊహించని ఎన్నో ఆకర్షణలు ఉన్నాయట.
అందరూ అనుకున్నట్టుగా ఈ రామాయణలో రణ్‌బీర్ కపూర్ కేవలం రాముడి వేషంలోనే కాకుండా పరశురాముడిగానూ కనిపించబోతున్నారని తెలిసింది. రెండు లుక్స్ మధ్య అస్సలు గుర్తుపట్టలేనంత వ్యత్యాసం చూపించబోతున్నారని టాక్. పైగా రెండు శ్రీవిష్ణు అంశ ఉన్న అవతరాలే కనుక దానికి అనుగుణంగా రణ్‌బీర్‌తో ద్విపాత్రాభినయం చేయిస్తున్నారని సమాచారం.
ఇక రావణుడు ఎత్తుకెళ్ళేటప్పుడు, సీత మాతాను కాపాడేందుకు ప్రయత్నించి తనువు చాలించే జటాయువు పక్షికి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ చెప్పబోతున్నారని తెలిసింది. తొలి భాగంలో రామసీత వివాహం, పద్నాలుగేళ్లు వనవాసం, చివర్లో రావణుడి ఎంట్రీతో శుభం కార్డు వేస్తారట. రెండో భాగంలో రావణుడిగా యశ్ విశ్వరూపం ఉంటుందని సమాచారం.
Ranbir Kapoor Ramayan Cast : ఇకపోతే హనుమంతుడి పాత్రలో సన్నీ దేవోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారట. వీఎఫ్ఎక్స్ వర్క్‌ను ఆస్కార్ విన్నింగ్ కంపెనీ డీఎన్‌ఈజీ చేయబోతున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. రామాయణాన్ని ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూపించినంత గొప్పగా చూపిస్తానని అంటున్నారు నితేశ్ తివారి. సినిమా తెలుగు వెర్షన్ సంభాషణలు రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి మొదటి భాగాన్ని 2026లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మొత్తం మూడు భాగాలుగా సినిమా రానుందట.
'మేనన్' నా ఇంటి పేరు కాదు' - అసలు విషయం చెప్పిన నిత్యా మేనన్ - Nithya Menen About Her Name
హీరోయిన్ రష్మికకు ప్రమాదం! - ఇప్పుడెలా ఉందంటే? - Heroine Rashmika Mandanna Injured