ETV Bharat / entertainment

షారుక్​ పిల్లల కన్నా రణ్​బీర్​ కుమార్తె చాలా రిచ్​​! ఆమె పేరిట రూ.వందల కోట్ల ఆస్తి! - RAHA KAPOOR THE RICHEST STARKID

షారుక్​ ఖాన్​ పిల్లల కన్నా రణ్‌బీర్, అలియా దంపతుల కుమార్తె రాహా సూపర్​ రిచ్​! ఆమె పేరుపై ఎంత ఆస్తి ఉందో తెలుసా?

Raha Kapoor becomes the richest starkid
Raha Kapoor becomes the richest starkid (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : April 13, 2025 at 11:50 AM IST

2 Min Read

Raha Kapoor The Richest Starkid : బాలీవుడ్ స్టార్ కపుల్‌గా రణ్‌బీర్ కపూర్- అలియా భట్ పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరూ 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఏడాది నవంబరు 6న వారికి పండంటి ఆడబిడ్డ జన్మనివ్వగా, ఆమెకు 'రాహా' అని నామకరణం చేశారు. అయితే ఈ స్టార్ కిడ్ ఏడాది వయసులోనే బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ పిల్లల కంటే రిచ్ అయిపోయిందట. ఇంతకీ రాహా ఆస్తుల విలువెంతో ఈ స్టోరీలో తెలుసుకుందామా?

రూ.250 కోట్ల విలువైన బంగ్లా!
ముంబయిలోని బాంద్రాలో రూ.250 కోట్ల బంగ్లాకు రాహా యజమాని అని తెలుస్తోంది. ఆమె పేరిట రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఇంత ఖరీదైన ఇల్లును రిజిస్టర్ చేయించారట. ఈ బంగ్లా ఖరీదు షారుక్‌ ఖాన్ నివాసం- మన్నత్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇల్లు- జల్సా కన్నా ఎక్కువని టాక్. దీంతో షారుక్‌ ఖాన్ పిల్లలు ఆర్యన్, అబ్రామ్, సుహానాల కన్నా రాహానే రిచ్ అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఫొటోగ్రాఫర్లుకు, మీడియాకు విజ్ఞప్తి
రాహా ఫొటోలను తీయొద్దని మీడియా, ఫొటోగ్రాఫర్లుకు అలియా భట్ ఇటీవలే విజ్ఞప్తి చేశారు. "మా ఇంట్లోకి దుండగులు చొరబడి రాహాను నాకు దూరంగా తీసుకువెళ్లిపోతున్నట్లు ఓసారి కల వచ్చింది. అంతకంటే దారుణమైన కల మరొకటి లేదు. అందుకే పాప సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు పాటించాలని నిర్ణయించుకున్నాను. తన గోప్యతకు భంగం కలగకుండా ఉండేలా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. కాబట్టి, మా అభ్యర్థనను అర్థం చేసుకోండి. మా అనుమతి లేకుండా రాహా ఫొటోలు తీయొద్దు. ఒకవేళ ఎప్పుడైనా మాతోపాటు పాప ఫొటోలను తీస్తే తన మొహం కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సరైన సమయం వచ్చాక ఆమెను తప్పకుండా మేమే మీ అందరి ముందుకు తీసుకువస్తాం. నా బిడ్డ శ్రేయస్సు కోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఇది ఒక ప్రత్యేక సమస్యగా మీకు అనిపించవచ్చు. కానీ తల్లిదండ్రులుగా మా బిడ్డను రక్షించుకోవడానికి మేము వీలైనంతంగా ప్రయత్నిస్తాం" అని అలియా భట్ వ్యాఖ్యానించారు.

సినిమాల విషయానికొస్తే
ఇటీవలే 'యానియల్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రణ్‌బీర్. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రణ్‌బీర్ మాస్ యాక్షన్‌కు నార్త్ ఇండియా ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం బ్రహ్మాస్త-2, రామాయణ్ సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే 'ఆల్ఫా' అనే సినిమాతో అలియా భట్ బిజీగా ఉన్నారు.

సమంత షాకింగ్ రివీల్​! రూ.కోట్లలో నష్టపోయిందట! అలా చేసినందుకే!

అది చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా- త్వరలో అభిమానుల్ని కలుస్తా: జూనియర్ ఎన్‌టీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.