Game Changer Nanaa Hyraanaa : 'గేమ్ ఛేంజర్' నానా హైరానా సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 47 మిలియన్ వ్యూస్‌కు (తెలుగు, తమిళ్, హిందీ) దక్కించుకుంది. మెలొడీ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. రామ్ చరణ్ కూడా షూటింగ్‌కు సంబంధించిన పలు దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు. అయితే తాజాగా ఈ సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన విశేషాలు తెలిశాయి.
ఈ సాంగ్ న్యూజిలాండ్‌లో 6 రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది. ఈ పాట కోసం ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగించారు. దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో ఈ సాంగ్‌ను ప్రత్యేకంగా చిత్రీకరించారని తెలిసింది. తమన్ సంగీతం అందించారు. తిరు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. ఆలిమ్ హకీమ్, రామ్ చరణ్‌కు ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ తీర్చిదిద్దారు. మనీష్ మల్హోత్ర ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. కార్తిక్, శ్రేయా ఘోషల్ గీతాన్ని ఆలపించారు.
కాగా, సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేశారు. దర్శకుడు శంకర్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దారు. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్, అంజలి, నవీన్‌చంద్ర, ఎస్.జె. సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
2025 సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 10న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఫారెన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్న మొదటి ఇండియన్ సినిమాగా గేమ్ ఛేంజర్ నిలవనుంది. యు.ఎస్.ఎ. (కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, టెక్సాస్)లో ఈ నెల 21 ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు మూవీ టీమ్ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. రీసెంట్గా తన పాత్రకు ఎస్ జే సూర్య డబ్బింగ్ పూర్తి చేశారు. బొమ్మ అదిరిపోయింది అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేకెత్తించారు.
గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ 2024 - టాప్‌లో పవన్ కల్యాణ్, IPL!
'పుష్ప 2' - ఇండియన్ సినిమాలో ఆల్‌టైమ్ రికార్డ్! - 5 రోజుల్లో రూ.922 కోట్లు