ETV Bharat / entertainment

'గేమ్ ఛేంజర్‌' ఐడియా నాదే- కానీ శంకర్‌ స్టోరీ మొత్తం మార్చేశారు: రెట్రో డైరెక్టర్‌ - GAME CHANGER STORY CONTROVERSY

రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్‌' మూవీ కాంట్రవర్సీ- డైరెక్టర్ శంకర్‌ కథ మొత్తం మార్చేశారు: రైట్రో డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజ్‌

Game Changer Story Controversy
Game Changer Story Controversy (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 25, 2025 at 11:22 AM IST

2 Min Read

Game Changer Story Controversy : రామ్‌చరణ్ నటించిన గేమ్‌ ఛేంజర్‌ మూవీపై తాజాగా వివాదం చెలరేగింది. తమిళ డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌, 'గేమ్ ఛేంజర్‌ సినిమా ఐడియా తనదే అని, కానీ డైరెక్టర్ శంకర్‌ స్టోరీ, స్క్రీన్‌ ప్లే మొత్తం మార్చేశారు' అని ఆరోపించారు.

తమిళ స్టార్‌ హీరో సూర్య నటించిన 'రెట్రో' మూవీని కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కార్తీక్ సుబ్బరాజ్‌ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో గేమ్ ఛేంజర్ మూవీపై, డైరెక్టర్ శంకర్‌పై విమర్శలు చేశారు.

"నేను గేమ్‌ ఛేంజర్‌ మూవీ కోసం వన్‌-లైన్ స్టోరీ ఇచ్చాను. ఒక సాధారణ ఐఏఎస్ ఆఫీసర్‌, రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు అనేది ఆ స్టోరీ లైన్‌. దీనిని స్టార్ డైరెక్టర్‌ శంకర్‌కు వినిపించాను. ఆయన ఈ సినిమాను పెద్ద తెరపై ఎంత గొప్పగా చూపిస్తారో అని చాలా ఎగ్జైట్ కూడా అయ్యాను. కానీ వాస్తవంలో ఇది మొత్తం తలకిందులైంది. ఈ సినిమా కోసం చాలా మంది ఇతర రైటర్లు పనిచేశారు. దీనితో స్క్రీన్‌ ప్లే చాలా వరకు మారిపోయింది. చివరికి సినిమా స్టోరీ కూడా కొంత వరకు ఛేంజ్ అయిపోయింది."
- కార్తీక్ సుబ్బరాజ్‌, రెట్రో డైరెక్టర్‌

రామ్ చరణ్‌, శంకర్‌ కాంబోలో ఎంతో ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చిన గేమ్ ఛేంజర్‌ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాపై అన్నివైపుల నుంచి విమర్శలు, నెగిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. దీనిపై కూడా కార్తీక్ సుబ్బరాజ్ స్పందించారు. " ఒక సినిమా ఎందుకు ఫెయిల్‌ అయ్యిందో, ఎందుకు హిట్‌ అయ్యిందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదో ఎవరూ చెప్పలేరు" అని అన్నారు.

దిల్‌ రాజు శ్రీ వెంటటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై చాలా పెద్ద బడ్జెట్‌ పెట్టి, రామ్‌ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తీశారు. ఈ సినిమాకు రూ.300 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారని చెబుతారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వరల్డ్ వైడ్‌గా ఇది కేవలం రూ.180 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. తమిళస్టార్ డెరెక్టర్‌ శంకర్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లు చూస్తున్నారు. వాటిలో గేమ్ ఛేంజర్ అట్టర్‌ ఫ్లాప్‌ నిలిచింది.

అట్లీ మూవీలో అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఇదే- న్యూ ​లుక్ వైరల్!

'రామాయణ్​'లో KGF బ్యూటీకి ఛాన్స్- యశ్​ వల్లే నో చెప్పిందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.