Chiranjeevi Ramcharan : తెలుగు సినిమాల్లోకి చాలా మంది స్టార్ హీరోల కుమారులు అడుగుపెట్టారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ మంచి నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుత తరంలో ఈ జాబితాలో హీరో రామ్ చరణ్ ఉన్నారు. మెగాస్టార్‌కు తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ సినిమాల్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరి మధ్య కలిసి ఇంటర్వ్యూలు, వివిధ సినిమా కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇటీవల రామ్ చరణ్, తనకు తండ్రికి మధ్య జరిగిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు? అదేంటంటే చిరంజీవి, రామ్ చరణ్‌ని పోలీసు బెల్ట్‌తో కొట్టారట.
రామ్ చరణ్ చేసిన తప్పేంటి?
2020లో ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, రామ్ చరణ్ తన చిన్నతనంలో తిన్న దెబ్బలు గుర్తు చేసుకున్నారు. "చిన్న తనంలో నన్ను ఒకే ఒక్కసారి కొట్టారు నాన్న. అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు. నా డ్రైవర్, సెక్యూరిటీ గేటు దగ్గర మాట్లాడుకోవడం గమనించాను. వారి కొన్ని మాటలు నాకు అర్థం కాలేదు. ఇంటి లోపలికి వెళ్లి నాగబాబు అంకుల్‌ను అడిగాను. అప్పుడే మా నాన్న షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చారు. అంకుల్‌ను నన్ను తన గదిలోకి తీసుకెళ్లాడరు.
నేను స్నేహితులు లేదా మరొకరి నుంచి కొన్ని మాటలు నేర్చుకున్నానని మా నాన్నకు చెప్పారు. అప్పుడు నాన్న బాబాయ్‌ను బయటికి పంపించారు. నాకు కారణం అర్థం కాలేదు. నేను వివరణ ఇవ్వవలసి వచ్చింది. మా తాత రిటైర్మెంట్ తర్వాత మా నాన్నకు బెల్ట్ బహుమతిగా ఇచ్చారు. అది తీసుకుని నన్ను కొట్టారు. అవి చాలా చెడ్డ పదాలు, వాటిని జీవితంలో ఎప్పుడూ ఉపయోగించవద్దు అని చెప్పారు అని వివరించాడు. ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ కుటుంబంలో ఫాలో అయ్యే విషయాలు ప్రస్తావించాడు. కుటుంబంలోని తల్లులు, మహిళలతో వాదించడం ఇష్టపడరని తెలిపాడు.
త్వరలో వస్తున్న సినిమాలు ఇవే
సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్, కియారా అద్వానీతో కలిసి ‘గేమ్ ఛేంజర్’ చేస్తున్నారు. దీనికి పాపులర్ తమిళ్ డైరెక్టర్ శంకర దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బింబిసారతో హిట్ అందుకున్న మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు.