RC 16 Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న మూవీ 'RC 16' (వర్కింగ్ టైటిల్). యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు పీరియాడిక్ స్టోరీతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.
గురువారం రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఫ్యాన్స్‌కు ఒక రోజు ముందే ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రివీల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మార్చి 27న ఉదయం 9.09 గంటలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్ట్‌లో రామ్‌చరణ్ వెనకాల నుంచి కనిపిస్తున్న ఫొటో ఉంది. మాస్ లుక్‌తో చేతిలో సిగార్ పట్టుకొని చెర్రీ నిలబడి ఉన్నారు. ఈ పోస్టర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా అనిపిస్తోంది. ఈ రివీల్ పోస్టర్‌తో మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు.
Grit, power, and an untamed spirit from the rural lands ❤️🔥#RC16 TITLE & FIRST LOOK out tomorrow at 9.09 AM 💥💥#RamCharanRevolts
— Vriddhi Cinemas (@vriddhicinemas) March 26, 2025
Global Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @IamJagguBhai @divyenndu… pic.twitter.com/ZvwUrN7fNl
కాగా, ఆర్సీ సినిమాలో జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటుడు జగపతిబాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, దివ్యేందు లాంటి స్టార్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దీనికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.