Chirajeevi Bond With Klinkaara : మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్ చరణ్ మధ్య చాలా బలమైన బంధం ఉంది. వీరిద్దరూ తండ్రీకొడుకుల్లా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటారు. అంతలా చిరు, చరణ్ మధ్య బాండింగ్ ఏర్పడింది. ఆడియో లాంఛ్, పలు వేదికలపై ఇప్పటికే ఈ విషయం రుజువైంది.
అయితే గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గతేడాది క్లీంకార పుట్టిన విషయం తెలిసిందే. ఈ చిన్నారిని మెగా కుటుంబం అల్లారుముద్దుగా చూసుకుంటోంది. మనవరాలితో చిరు ఉన్న ఫొటోలు చాలా సార్లు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి- క్లీంకార మధ్య ఉన్న బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ చరణ్ ఏమన్నారంటే?
'చిన్నపిల్లాడిలా మారిపోతారు'
తన కూతురు క్లీంకారతో ఆడుకుంటూ చిరంజీవి చిన్నపిల్లాడిలా మారిపోతారని చరణ్ చెప్పుకొచ్చారు. అలాగే క్లీంకారతో అన్నయ్యలా ప్రవర్తిస్తారని వెల్లడించారు. " క్లీంకార నాన్న(చిరంజీవి)ను కొట్టినా ఏమి అనరు. తనను తాత అని పిలవొద్దని అంటారు. అలా పిలిస్తే చాలా బోరింగ్‌గా ఉంటుందని, చిరుత అని పిలవమంటారు. తెలుగులో గ్రాండ్ ఫాదర్ అంటే తాత అని, చీతా అంటే చిరుత అని చెబుతుంటారు. నా కూతురు క్లీంకారాతో అమ్మనాన్నలు ఎంజాయ్ చేయడం చూసి చాలా సంతోషిస్తుంటాను. నేను, ఉపాసన 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత తల్లిదండ్రులయ్యాం. చాలా సంతోషంగా ఉన్నాం. క్లీంకార మా జీవితాల్లోకి అదృష్టాన్ని తీసుకొచ్చింది" అని చరణ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
'కళ్లలో నీళ్లు తిరిగాయి'
అలాగే చిరంజీవి కూడా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఉపాసన గర్భం దాల్చడం గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. "చాలా కాలం నుంచి ఈ వార్త కోసం ఎదురుచూస్తున్నాం. జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల పూర్తై హైదరాబాద్ వచ్చిన చరణ్, ఉపాసన ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్నారు. అప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. " అని చిరంజీవి తెలిపారు.
సినిమాల పరంగా
ఇక సినిమాల విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. పొలిటికల్ యాక్షన్ థీమ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా, ఈ సినిమాలో నటి అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్‌తో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిరు, ఉపాసన కాకుండా రామ్ చరణ్ ఎవరికి భయపడతారంటే? - Game Changer Ram Charan
'సౌత్‌లో ఆయన డిఫరెంట్ యాక్టర్' - రైనా ఫేవరట్ తెలుగు హీరో ఎవరంటే? - Suresh Raina Favourite Actor