ETV Bharat / entertainment

అప్పుడు నా గుండె పగిలింది- శ్రీదేవి కోసం రోజంతా ఏడ్చేశా: అల్లు అర్జున్ - ALLU ARJUN

శ్రీదేవి కోసం ఏడ్చిన అల్లు అర్జున్- ఎందుకో తెలుసా?

Allu Arjun Sridevi
Allu Arjun Sridevi (Source : IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : April 23, 2025 at 9:45 PM IST

2 Min Read

Allu Arjun Cried For Sridevi : అందాల తార దివంగత నటి శ్రీదేవి సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. అందం, నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం నటనకు ఫిదా అయిన వాళ్లున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​కు కూడా శ్రీదేవిపై క్రష్ ఉందని గతంలో పలుమార్లు చెప్పారు. అయితే ఆమె చేసిన పనికి తాను ఓ రోజంతా ఏడ్చేసినట్లు బన్నీ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ఆయన ఎందుకు ఏడ్చారంటే?

90ల్లో యువతకు శ్రీదేవినే డ్రీమ్ గర్ల్. ఆమెకు యూత్​లో ఎక్కువగా ఫాలోయింగ్​ ఉండేది. బన్నీకి కూడా శ్రీదేవిపై క్రష్ ఉండేదట. అయితే శ్రీదేవి చేసిన పనితో బన్నీ హార్ట్ బ్రేక్ అయ్యిందని ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఆ పని ఏంటో కాదు. ఆమె బోనీ కపూర్​ను పెళ్లాడడమే. నాకు శ్రీదేవిపై క్రష్ ఉండేది. ఆమెపై విపరీతమైన ప్రేమ ఉండేది. కానీ, తను బోనీ కపూర్​ను పెళ్లి చేసుకుందని తెలిసి నమ్మలేకపోయను. ఆ రోజు నా హార్ట్ బ్రేక్ అయ్యింది అని బన్నీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

బన్నీ తదుపరి సినిమా కోసం అట్లీతో టై అప్​ అయ్యారు. 'AA 22 x A6' వర్కింగ్ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కనుంది. బన్నీకి హీరోగా ఇది 22వ సినిమా కాగా, అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఆరో చిత్రం. రీసెంట్​గా ఈ సినిమా కన్ఫార్మ్ చేస్తూ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు వీడియోలో చూపించారు. అభిమానుల ఊహకు అందని రీతిలో ఈ సినిమా ఉండనుందని తెలిపారు. ఈ సినిమాలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడనున్నారు.

దీని కోసం అట్లీ, అల్లు అర్జున్‌ లాస్‌ ఏంజెలెస్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ సంస్థను సంప్రదించారు. హాలీవుడ్ రేంజ్​లో విజువల్స్‌ ఉండనున్నట్లు తెలిపారు. అల్లు అర్జున్‌కు స్క్రీన్‌ టెస్ట్‌ చేసిన విజువల్స్ ఇందులో చూపించారు. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. సన్​ పిక్చర్స్​ ప్రొడక్షన్ హౌస్ ఈ ప్రాజెక్ట్​ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

బన్నీ- అట్లీ మూవీ ఫిక్స్- స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్​కు అల్లు అర్జున్​ సర్​ప్రైజ్

'బన్నీ ఒక్కరే అలా చేశారు, బాలీవుడ్​లో ఏ హీరో చేయలేదు!'- గణేశ్ మాస్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.