Heroine Rashmika Mandanna Injured : హీరోయిన్ రష్మిక తన ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. తాను ఇటీవలే ఓ ప్రమాదం బారిన పడినట్లు వెల్లడించారు. అయితే ఇది చిన్న ప్రమాదమేనని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఇంట్లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నానని కూడా స్పష్టత ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
"నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి చాలా రోజులు అయిపోయింది. పబ్లిక్‌లో కూడా కనిపించి చాలా రోజులైంది. ఓ చిన్న ప్రమాదం జరగడం వల్లే నేను కనిపించలేదు. అందుకే ఆగస్ట్‌లో చురుగ్గా ఉండలేకపోయాను. ఇప్పుడు సూపర్ యాక్టివ్‌గా ఉన్నాను. మీరెప్పుడు జాగ్రత్తగా ఉండటానికే అధిక ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం చాలా చిన్నది. రేపు ఏం జరుగుతుందో అస్సలు ఎవరికీ తెలీదు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి" అంటూ ఆమె తన ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చారు.
అలానే లడ్డూలు కూడా ఎక్కువగా తింటున్నట్టు మరో అప్‌డేట్ ఇచ్చారు రష్మిక. నవ్వుతున్న ఎమోజీలను జోడించారు. అయితే తనకు ప్రమాదం ఎక్కడ జరిగిందనే విషయమై వివరాలు వెల్లడించలేదు రష్మిక. దీంతో ఇప్పుడు రష్మిక పెట్టిన పోస్ట్‌పై పలువురు అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
Rashmika Mandanna Upcoming Movies : రష్మిక చివరిగా రణ్‌బీర్ కపూర్‌తో కలిసి 'యానిమల్' చిత్రంలో నటించి భారీ బ్లాక్ బస్టర్‌ను అందుకున్నారు. ఇది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకోవడంతో పాటు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో 'పుష్ప 2', ధనుశ్, కింగ్ నాగార్జునతో కలిసి 'కుబేర', బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్‌తో 'సికందర్', విక్కీ కౌశల్‌తో 'ఛావా', 'రెయిన్ బో', 'ది గర్ల్‌ఫ్రెండ్' సహా తదితర చిత్రాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఇవన్నీ వరుసగా విడుదల కానున్నాయి.
రజనీకాంత్ 'వేట్టాయాన్' - హుషారెత్తించేలా ఫస్ట్ సాంగ్ రిలీజ్ - Vettaiyan Manasilayo Song Released
డైరెక్టర్‌గా విజయ్ దళపతి కొడుకు - టాలీవుడ్ హీరోతో ఫస్ట్ మూవీ! - Vijay Thalapathy Son Movie