Krrish 4 Priyanka Chopra Remuneration : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'క్రిష్'. 'కోయీ మిల్ గయా' అనే సినిమాతో 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సిరీస్ ఆ తర్వాత 'క్రిష్ 2', 'క్రిష్ 3' చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఇందులో హృతిక్‌తో అందాల సుందరి ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్‌లో కనిపించింది. ప్రముఖ నటి కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు చేశారు.
ఇటీవల క్రిక్ 4ను ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమాను హృతికే స్వయంగా డైరెక్ట్ చేయనున్నారు. కాగా, ఇప్పుడు ఈ సినిమా గురించి ఇప్పుడు మరో అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలోనూ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా లీడ్ రోల్ పోషిస్తోందట. క్రిష్ 4 ఐడియా ఆమెను ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రియా అనే పాత్రలో ఆమె మెరవబోతోందని సినీ వర్గాల టాక్. అయితే ఈ విషయంపై ప్రియాంక చోప్రా టీమ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
'రెమ్యునరేషన్ రూ.20-30 కోట్లు'
ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రీ రూ.20-30 కోట్లు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా కోసం ప్రాఫిట్ షేరింగ్ మోడల్ కాకుండా ఫిక్స్డ్ ఫీజు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిన్నది సూపర్ స్టార్ మహేశ్ బాబు- దిగ్గజ దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 సినిమాకు దాదాపు రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రియాంకను కలిసిన హృతిక్
అమెరికా పర్యటనలో ఉన్న హృతిక్ తాజాగా ప్రియాంక చోప్రాను కలిశారు. ఆమె భర్త నిక్ జోనస్ మ్యూజికల్ 'ది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ న్యూయార్క్' షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. "స్నేహితులతో సరదాగా గడిపే రాత్రి అవుతుందని అనుకుంటూ మేము లోపలికి వెళ్లాము. కానీ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠభరితంగా, ప్రేరణతో బయటకు వచ్చాము" అని దానికి క్యాప్షన్ జోడించాడు.
Krrish 4 Shooting : 'క్రిష్-4' కథకు హృతిక్ గ్రీన్ సిగ్నల్!.. త్వరలో సెట్స్‌పైకి సూపర్ హీరో మూవీ!
రోషన్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ - అప్పుడు నయన్, ఇప్పుడు హృతిక్!